Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 కోసం పాత కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌజ్‌లోకి ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వారి రాకతో ఇప్పుడు బిగ్ బాస్ లో రచ్చ మరోలా ఉంది. వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ, హరితేజ, నయని పావని, గౌతమ్ కృష్ణ, మెహబూబ్, రోహిణి బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అవినాష్, గంగవ్వ, రోహిణి, టేస్టీ తేజ, హరితేజలు వినోదాన్ని పంచడంలో ముందుంటారు. వీరి ద్వారా టాస్క్ లతో రచ్చ చేయించడంతోపాటు వినోదాన్ని కూడా పంచేందుకు ప్లాన్ చేశారట. ఇక ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో పాత కంటెస్టెంట్లని కొత్త కంటెస్టెంట్లు నామినేట్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్.
వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్లకి టైమ్ లేదు కాబట్టి వాళ్లని నామినేట్ చేయడానికి లేదని, అలాగే మెగా చీఫ్ అయిన నబీల్‌ని నామినేట్ చేయడానికి లేదు. ఈ క్రమంలో హరితేజ.. యష్మి, పృథ్వీరాజ్‌లను నామినేట్ చేసింది. నాగమణికంఠని వరుసగా నామినేట్ చేయడం, ఆయన్ని టార్గెట్ చేయడం బాగా లేదని చెప్పి నామినేట్ చేసింది. పృథ్వీరాజ్ ని సైతం ఆమె నామినేట్ చేసింది. గౌతమ్ కృష్ణ వచ్చి.. విష్ణు ప్రియా, యష్మిలను నామినేట్ చేశాడు. తన గేమ్ పక్కన పెట్టి పక్కవారిపై ఫోకస్ పెడుతున్నావని విష్ణు ప్రియాని అన్నాడు గౌతమ్ కృష్ణ. అలాగే యష్మిని నామినేట్ చేస్తూ, రివేంజ్ నామినేషన్ నచ్చ లేదని తెలిపారు. నయని పావని.. విష్ణు ప్రియా, కిర్రాక్ సీతలను నామినేట్ చేసింది. మెహబూబ్.. కిర్రాక్ సీత, యష్మిలను నామినేట్ చేశాడు.
టేస్టీ తేజ.. కిర్రాక్ సీత, మణికంఠలను నామినేట్ చేశాడు. ఇప్పటి వరకు పెద్దగా సీత ఆట్ట పెద్దగా లేదని చెప్పాడు.అలాగే మణికంఠని నామినేట్ చేస్తూ అందరికి సమస్యలున్నాయి, చెప్పలేని బాధలున్నాయి. కానీ ఇక్కడ ఎవరూ చెప్పుకోరని, మనసులోనే దాచుకుంటారని, కానీ నువ్వు ప్రతి రోజు అదే సింపతి ప్లే చేస్తున్నావని, నీ ఆట తీరు ఫేక్‌గా ఉందని ఆరోపించారు. అయితే కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు అంతా నాగమణికంఠ, యష్మిలను టార్గెట్ చేశారు. మణికంఠకి సింపతీ చూపిస్తూ యష్మిని టార్గెట్ చేస్తున్నారు. మణికంఠని బ్యాక్ టూ బ్యాక్ యష్మి నామినేట్ చేసిన నేపథ్యంలో అది సరైనది కాదని కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు చెబుతున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.