Home » Entertainment » Bigg Boss Telugu 8 Nabil Saves Avinash Nikhil Crowned As Badshah
Entertainment

Bigg Boss Telugu 8 : అవినాష్ భ‌లే సేవ్ అయ్యాడుగా.. మందేస్తానంటూ య‌ష్మీ సంచ‌ల‌న కామెంట్స్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: November 18, 2024 5:11 pm
Advertisement

Bigg Boss Telugu 8 బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి వారం ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సారి ఊహించ‌ని విధంగా ఎలిమినేష‌న్ ఆగిపోయింది.నామినేష‌న్స్ చివ‌ర‌లో టేస్టీ తేజ‌, అవినాష్ నిల‌వ‌డంతో ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ని నాగార్జున ప్ర‌క‌టించాడు. ఇందులో టేస్టీ తేజ సేవ్ అవ్వ‌గా…అవినాష్ ఎలిమినేట్ అవుతోన్న‌ట్లు బిగ్‌బాస్ చెప్పాడు.తాను ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ గెల‌వ‌డానికి అవినాష్ కార‌ణ‌మ‌ని, అత‌డి కోసం ఈ పాస్ వాడుతాన‌ని న‌బీల్ అన్నాడు. అన్న‌ట్లుగా అత‌డిని హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోకుండా కాపాడాడు. బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌లో కూడా ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ద్వారా తాను ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డిన సంగ‌తిని అవినాష్ గుర్తుచేసుకున్నాడు.

Advertisement

Bigg Boss Telugu 8 పాత కంటెస్టెంట్స్ సంద‌డి..

ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో అంతా సరదాగా గడిపారు ఈ వారం అంతా. ఇక అందులో భాగంగా రెండు రోజులు నాగార్జున సెలబ్రిటీలు.. కంటెస్టెంట్ లవ్ స్టోరీలతో పద్దతిగా సాగింది. అవినాష్ కు టేస్టీ తేజకు మధ్యే పడింది దాంతో తేజా కాస్త టెక్షన్ ఫీల్ అయ్యాడు. కాని చివరకు ఇద్దరికి న్యాయం జరిగింది. సో ఎలిమినేట్ అవ్వకుండా సేఫ్ అయిన అవినాశ్ ఇక నుంచి నా తన గేమ్లో సత్తా చూస్తారంటూ సరదాగా వ్యాక్యణించారు. ఇక మాజీ కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ రచ్చరచ్చ చేశాడు. అందులో రైటర్ కోనా వెంక‌ట్ వచ్చి హీరో మెటీరియల్ అని మెచ్చుకున్నారు. య‌ష్మి కోసం శ్రీస‌త్య‌, సంయుక్త బిగ్‌బాస్‌లోకి వ‌చ్చారు. య‌ష్మికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను బ‌య‌ట‌పెడితే మూడు ల‌క్ష‌లు ప్రైజ్‌మ‌నీ పెంచుతాన‌ని నాగార్జున అన్నాడు.

Bigg Boss Telugu 8 : అవినాష్ భ‌లే సేవ్ అయ్యాడుగా.. మందేస్తానంటూ య‌ష్మీ సంచ‌ల‌న కామెంట్స్..!

Advertisement

ప్ర‌తిరోజు సాయంత్రం ఆరు త‌ర్వాత య‌ష్మి మందేస్తుంద‌ని శ్రీస‌త్య అన్న‌ది. ఏక్ పెగ్‌లా అంటూ చిల్ అవుతుంద‌ని తెలిపింది. య‌ష్మి మందు తాగుతాన‌ని ఒప్పుకుంది. బిగ్‌బాస్‌లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌గా గౌత‌మ్‌, నిఖిల్‌, న‌బీల్‌, అవినాష్‌, ప్రేర‌ణ పేర్లు చెప్పింది శ్రీస‌త్య‌.టేస్టీ తేజ కోసం అత‌డి తండ్రితో పాటు బిగ్‌బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ స్టేజ్‌పైకి వ‌చ్చారు. టేస్టీ తేజ బిగ్‌బాస్‌కు వ‌స్తాడ‌ని, టాప్ ఫైవ్‌లో ఉంటాడ‌ని ఊహించ‌లేద‌ని టేస్టీ తేజ తండ్రి అన్నాడు. మిగిలిన వాళ్ల‌ను వ‌దిలేసి నీ ఆట నువ్వు ఆడితే మంచిద‌ని నిఖిల్‌కు వీజే స‌న్నీ స‌ల‌హా ఇచ్చాడు. సోమ‌వారం నామినేష‌న్స్ ఎపిసోడ్‌లో ఈ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన మ‌ణికంఠ‌, సోనియా, శేఖ‌ర్ బాషాతో మిగిలిన వాళ్లు అటెండ్ కాబోతున్నారు. ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్‌…హౌజ్‌లో ఉన్న వారిని నామినేట్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి