Bigg Boss Wild Card Entry : మోనితకు పోటీగా వంటలక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్
Bigg Boss Wild Card Entry : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి కూడా 5 రోజులు అవుతోంది. వారం కూడా కాకముందే హౌస్ లో రచ్చ స్టార్ట్ అయింది. కంటెస్టెంట్ల మధ్య కావాల్సినంత గొడవలు పెట్టేశాడు బిగ్ బాస్. ఇక గ్రూప్ రాజకీయాలు, ప్రేమలు, గొడవలు, అలగడాలు.. అన్నీ స్టార్ట్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ లో. అందులో ఎక్కువ మంది సీరియల్ హీరోయిన్లే ఉండటం విశేషం. ఇక.. ఇదివరకు బిగ్ బాస్ వేరు.. ఇప్పటి బిగ్ బాస్ వేరు. ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టా. అవును.. ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సీజన్ బిగ్ బాస్.
అన్నట్టుగానే హౌస్ లో అన్నీ ఉల్టా పుల్టాగా జరుగుతున్నాయి. తొలి వారం నామినేషన్లు కూడా చాలా వాడీవేడీగా సాగాయి. బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్స్ అలా ఉంటాయి మరి. తొలి వారం ఎవరు బయటికి వెళ్తారో తెలియదు కానీ.. ఇప్పటి వరకు హౌస్ లో ఉన్నది కేవలం 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే. అంటే.. మరో కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లాలి. మొత్తం 15 మంది 15 వారాలు ఈ షో నడుస్తుంది కాబట్టి మరో వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు బిగ్ బాస్ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అయితే.. వైల్డ్ కార్డు ఎంట్రీగా ఎవరిని పంపించాలని వ్యూహాలు రచిస్తోంది.Scorpion Business : తేలు విషంతో బిజినెస్ .. కోట్లలో ఆదాయం .. ఎక్కడో తెలుసా ..??
Bigg Boss Wild Card Entry
Bigg Boss Wild Card Entry : మోనితకు పోటీగా వంటలక్కను దించబోతున్నారట
హౌస్ లో ఎక్కువగా హడావుడి చేస్తూ మోనిత క్యారెక్టర్ లోనే ఉంటోంది శోభా శెట్టి. ఆ క్యారెక్టర్ నుంచి అస్సలు బయటికి రావడం లేదు. తనను ఎవరైనా ఏదైనా అంటే చిర్రెత్తుకొస్తోంది తనకు. నామినేషన్లలో తన పేరు చెప్పినా కూడా తను తట్టుకోవడం లేదు. అందుకే మోనితకు పోటీగా ఏకంగా కార్తీక దీపం వంటలక్కనే దింపాలని బిగ్ బాస్ భావిస్తున్నాడట. సీరియల్ లో ఇద్దరూ ఒక్క వ్యక్తి కోసం కొట్టుకున్నట్టే.. ఇక్కడ కూడా ఇద్దరికీ పోటీ ఉండేలా చేయాలని కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దింపనున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
