bindu madhavi stunning comments about her love
Bindu Madhavi : బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి టైటిల్ అందుకున్నహీరోయిన్ బిందు మాధవి. ఆవకాయ్ బిర్యానీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రామ్ హీరోగా నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అలరించింది. అంతే కాకుండా నానికి జోడిగా పిల్ల జమిందార్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. తమిళంలోనే బిందు మాధవికి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో బిందు మాధవి విన్నర్‌గా నిలవడంతో అమ్మడికి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఇక సోషల్ మీడియాలోను బిందు మాధవి చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇటీవల కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. అయితే ఒక నెటిజన్ మాత్రం ఆ ఫోటోలపై స్పందిస్తూ.. బిగ్ బాస్ కార్యక్రమంలో బిందు మాధవి ఉన్నప్పుడు తనపై చాలా గౌరవం ఉండేదని.. ఇతర కంటెస్టెంట్లు అందరూ బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నప్పటికీ బిందు మాధవి మాత్రం చక్కగా, పద్ధతిగా సంప్రదాయ దుస్తులు ధరిస్తూ డండడంతో తనపై చాలా గౌరవం ఉండేదని… అయితే ఈ ఫోటోలను చూశాకా తనపై ఉన్న ఆ గౌరవం పోయింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కొందరు అయితే దారుణంగా కామెంట్ చేశారు. వాటన్నింటికి తనదైన శైలిలో బదులు ఇచ్చింది బిందు మాధవి. బిందు మాధవి తన చిన్ననాటి లవ్ స్టోరీని బిగ్ బాస్ షోలో బయటపెట్టిన విషయం విదితమే. తాను ప్రతి రోజు తన తండ్రి తో కలిసి షటిల్ ఆడటానికి వెళ్ళేదాన్ని అని చెప్పింది. అయితే అక్కడ ఒక అబ్బాయి తనకు తెలియకుండా తన స్కూటీ పై ప్రతి రోజూ ఏదో ఒక గిఫ్ట్ ఉంచేవాడని అలా జరగటం తన ప్రేమలో మొదటి అనుభూతి అంటూ పేర్కొంది.
bindu madhavi stunning comments about her love
దాంతో తాను అతడిని కలవాలి అని చాలా ఆశపడినట్టు తెలిపింది. మొత్తానికి ఒకరోజు అతడిని కలిశానని.. ఆ తర్వాత అతడు తనను రోజూ బయటకు తీసుకువెళ్ళేవాడని చెప్పింది. తనకు అన్ని అనుభవాలు అతడి వల్లే జరిగాయని చెప్పింది. అంతే కాకుండా అతడి వల్లే తాను ఇండిపెండెంట్ గా ఉండటం కూడా నేర్చుకున్నా అంటూ వ్యాఖ్యానించింది. కానీ చాలా వరకు ఫస్ట్ లవ్ లు బ్రేకప్ అవుతాయని తన ఫస్ట్ లవ్ కూడా బ్రేకప్ అయ్యిందని చెప్పింది. అది అలా ఉంటే తెలుగులో ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్న బిందు మాధవికి మలయాళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భామకు అక్కడి మెగాస్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినట్లు టాక్. ప్రణవ్ మోహన్ లాల్ సినిమా హిట్ అయితే.. బిందు మాధవికి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్‌లు వస్తాయని అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.