Home » Entertainment » Bithiri Sathi Remuneration Too High
Entertainment

Bithiri Sathi : బిత్తిరి స‌త్తి నెల ఆదాయం అన్ని ల‌క్ష‌లా.. షాక్ అవుతున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Published on: May 30, 2022, 10:00 am
Advertisement

Bithiri Sathi : జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు వెళ్ల‌డం అంత ఈజీ కాదు. దాని వెన‌క చాలా కృషి ఉంటుంది. అలా ఎంతో క‌ష్ట‌ప‌డి అంద‌రి మ‌న‌సులు గెలుచుకునే స్థాయికి వ‌చ్చారు బిత్తిరి స‌త్తి. తనదైన స్టైల్ లో మాట్లాడుతూ..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన టీవీ కమెడియన్ ఎవరూ అంటే అందరు టక్కున చెప్పే పేరే ఈ అది బిత్తిరి సత్తి . వి6 ఛానల్ లో ‘తీన్మార్ వార్తలు’ అనే కార్యక్రమం ద్వారా ప్రారంభించిన ఈయన డిఫరెంట్ గెటప్స్‌ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

Advertisement

ముఖ్యంగా కొత్తగా విడుదలైన సినిమాలపై, రాజకీయ పరిణామాలపై, ఇతర సంగతులపై సత్తి చేసే పేరడీలకు మంచి స్పందన వచ్చింది.పాపులారిటీ వచ్చాక బిత్తిరి స‌త్తికి ప‌లు ఛానల్స్ భారీగా ఆఫ‌ర్స్ చేశాయి. అలా ఛాన‌ల్స్ మార్చుకుంటూ వ‌చ్చిన ఆయ‌న ఇప్పుడు సాక్షీ టీవీలో వర్క్ చేస్తున్నాడు. ఇంత పాపులారిటీ, ఫ్యాన్ బేస్ ఉన్న బిత్తిరి సత్తి ఆదాయాం ఎంత అని..సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ టాప్ యాంకర్ల రెమ్యునరేషన్లతో పోల్చి చూస్తే బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎక్కువ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Bithiri Sathi remuneration too high

Advertisement

Bithiri Sathi : స‌త్తికి ల‌కారాల రెమ్యున‌రేష‌న్..

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మహేష్ బాబును, వెంకటేష్ వరుణ్ తేజ్ లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా బిత్తిరిసత్తి మళ్ళీ ఫాంలోకి వచ్చాడు అంటున్నారు .ఈయన ఒక ఇంటర్వ్యూ చేస్తే సుమారు రెండు లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక బిత్తిరి సత్తి మీడియా న్యూస్ ఛానల్ లో డిమాండ్ను బట్టి మారుతూ వస్తున్నాడట. ప్రస్తుతం నెలకు 5 నుంచి 7 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని అందుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సుమ కంటే ఎక్కువ ఆదాయం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బిత్తిరి సత్తికి సినిమా ఆఫర్లు కూడా వస్తుండగా వాటిపై అంత దృష్టి పెట్ట‌డం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు వెండితెర‌పై అలా మెరుస్తుంటాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి