Home » Entertainment » Breaking On Very Soon Prabhas Engagement To Kriti Sanon
Entertainment

Prabhas – Kriti Sanon : బ్రేకింగ్ అతి త్వరలో ప్రభాస్.. కృతి సనన్.. నిశ్చితార్థం..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 28, 2022, 6:20 pm
Advertisement

Prabhas – Kriti Sanon : గల్ఫ్‌లో ఉంటూ ఇండియన్ మూవీస్‌కు రివ్యూలు ఇచ్చే వివాదాస్పద విశ్లేషకుడు ఉమైర్ సంధు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చారు. ప్రభాస్, కృతి సనన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా త్వరలో నిశ్చితార్థం కూడా చేసుకోవడానికి రెడీ తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలో విడుదలయ్యే ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సంపాదించిన ఉమైర్ సంధు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. “ఆదిపురుష్” మూవీలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనన్ నటించడం జరిగింది. అప్పటినుండి వీరిద్దరి మధ్య సంథింగ్ ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు రావడం జరిగాయి.

Advertisement

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన సమయంలో కూడా బాలీవుడ్ మీడియా.. కృతి సనన్ తో… ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు ప్రసారం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవలే “బేడియా” ప్రమోషన్ కార్యక్రమంలో.. భాగంగా వరుణ్ ధావన్..కృతి సనన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నయి. ‘ఝలక్ దిఖ్లా జా’ షోలో.. పాల్గొన్న వరుణ్ మరియు కృతి లను హోస్ట్ కరణ్ జోహార్ పలు ప్రశ్నలు వేయడం జరిగింది. నీ లిస్ట్ లో కృతి పేరు ఎందుకు మిస్ అయ్యింది అని వరుణ్ నీ అడగడంతో.. ‘‘ఆమె పేరు వేరే హృదయంలో ఉంది’’ అని వరుణ్ అన్నారు.

Breaking on very soon Prabhas engagement to Kriti Sanon

Advertisement

ఇంతకీ ఆ లక్కీ పర్సన్ ఎవరు అని కరణ్ అనగానే.. ‘‘ముంబైలో లేని ఒక వ్యక్తి. ప్రస్తుతం అతను దీపికాతో షూటింగ్‌లో ఉన్నాడు’’ అని వరుణ్ వెల్లడించారు. దీంతో ఆ వ్యక్తి ప్రభాస్ అని అందరు ఫిక్స్ అయిపోయారు. విషయంలోకి వెళ్తే ప్రభాస్… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో..”ప్రాజెక్ట్ కే” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకొనే. దీంతో వరుణ్ ఇన్ డైరెక్ట్ గా.. ప్రభాస్..కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు తెలియజేశాడు. ఈ వార్త ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇలాంటి సమయంలో గల్ఫ్‌లో ఉంటూ ఇండియన్ మూవీస్‌కు రివ్యూలు ఇచ్చే వివాదాస్పద విశ్లేషకుడు ఉమైర్ సంధు కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ప్రభాస్..కృతి ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు చెప్పటం.. మరింత సంచలనంగా మారింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి