Home » Entertainment » Breakup With Deepthi Sunaina My Heart Is Broken Shanmukh
Entertainment

Shanmukh : దీప్తితో బ్రేకప్ కు కార‌ణం ఏంటో చెప్పిన షణ్ముక్..!

Authored By
mallesh
The Telugu News | Published on: January 3, 2022, 5:00 pm
Advertisement

Shanmukh : షణ్ముక్, దీప్తి సునయన ముందు నుంచీ లవర్స్.. బిగ్‌బాస్ హౌస్ లో జరిగిన పరిణామాల అనంతరం వీరిద్దరు విడిపోయారని ఎన్నో విషయాలు ప్రచారం అయ్యాయి. దీనిపై షణ్ముక్ తాగాజా స్పందించాడు. నెటిజన్స్ సైతం రకరకాల పోస్టులు పెడుతూ స్పందిస్తున్నారు. ప్రేమలో పడిన వారిలో చాలా మంది బ్రేక్ చెబుకుంటారు. దానిని కొందరు లైట్ గా తీసుకుంటే మరి కొందరు సీరియస్ గా తీసుకుంటారు. కొందరైతే ఎంత తొందరగా పడుతారు.. అంతే తొందరగా బ్రేకప్ చెబుతూ తమ బంధానికి ముగింపు చెబుతుంటారు. ఇందులో కొందరి లవ్ స్టోరీలు వైరల్ గా మారుతాయి. తాజాగా షణ్ముక్, దీప్తి లవ్ స్టోరీ కూడా వైరల్‌గా మారింది.

Advertisement

Shanmukh : బిగ్‌బాస్ ముగిశాకే అసలు కథ

షణ్ముక్ బిగ్ బాస్ లో కొనసాగినంత కాలం దీప్తి అతనికి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. కానీ బిగ్ బాస్ షో పూర్తయ్యాక అసలు కథ స్టార్ట్ అయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వారి లవర్స్ హ్యాపీగా కలుసుకుంటున్నారు. రకరకాలు పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ షణ్ముక్, దీప్తి, సిరి, శ్రీహాన్ మాత్రం సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఇలా గ్యాప్ రావడంతో వారు బ్రేకప్ చెప్పుకున్నారని, విడిపోయి ఉంటారని కామెంట్స్ చేశారు నెటిజన్స్. ప్రస్తుతం ఆ కామెంట్స్ నిజమేనని తేలింది. షణ్ముక్ తో కలిసి ఉండలేనని, తామిద్దరం ఫ్రెండ్స్ గానే ఉంటామని చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టింది దీప్తి.

breakup with deepthi sunaina my heart is broken shanmukh

Advertisement

ఇక ఆమె ఏ డిసిషన్ తీసుకున్నా.. తనకు ఇష్టమేనని, ఆమె సంతోషంగా ఉంటే చాలని చెప్పుకొచ్చాడు షణ్ముక్. బ్రేకప్ అయిన తర్వాత తాజాగా మొదటి సారి పోస్ట్ పెట్టాడు షణ్ముక్. రెండు హార్ట్ సింబల్స్, గుండె బద్దలయినట్టు రెండు హార్ట్ సింబల్స్ ను షేర్ చేశాడు. బ్రేకప్ అయిన తర్వాత దీప్తి కన్నీరు పెట్టుకోగా.. ప్రస్తుతం షణ్ముక్ ముఖంలో మాత్రం బాధ కనిపించడం లేదు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి