Home » Entertainment » Bullet Bhaskar Father Satires On Anchor Rashmi In Sridevi Drama Company
Entertainment

Anchor Rashmi : యాంకర్ రష్మీ బాగా చేయడం లేదట.. సుధీర్ కావాలన్న బుల్లెట్ భాస్కర్ తండ్రి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: June 27, 2022 11:02 am
Advertisement

Anchor Rashmi : బుల్లెట్ భాస్కర్ తండ్రి చేస్తోన్న కామెడీకి అందరూ ఫిదా అవుతున్నారు. బుల్లెట్ భాస్కర్ మీద పంచులు వేస్తూ సెటైర్లు వేస్తూ ఆయన తండ్రి ఫేమస్ అయ్యాడు. అయితే బుల్లితెరపై బుల్లెట్ భాస్కర్ తండ్రికి ఇప్పుడు మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆయన పదే పదే రష్మీ మీద కౌంటర్లు వేస్తుంటాడు. ఊ అంటే ఆమె ప్రేమ కథ, సుధీర్ మ్యాటర్ మీద కౌంటర్లు వేస్తుంటాడు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్‌లోనూ రష్మీ మీద, ఆమె యాంకర్ మీద కౌంటర్లు వేశాడు. లేడీ యాంకర్ ఉంటే ఇలానే ఉంటుందని అనేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో భాగంగా మొగుడ్స్ పెళ్లామ్స్ అనే కాన్సెప్ట్‌తో వచ్చారు.

Advertisement

అందులో భాగంగా అందరూ కలిసి కబడ్డీ గేమ్ ఆడారు. అయితే కౌశల్ వెళ్లి ముగ్గురిని అవుట్ చేసి వచ్చాడు. అలా గేమ్ ముందుకు వెళ్లింది. అయితే చివర్లో మాత్రం పెళ్లామ్స్ టీం గెలిచిందంటూ రష్మీ చెప్పుకొచ్చింది. మేం ఏడుగురిని అవుట్ చేశాం.. వాళ్లు ఆరుగురినే అవుట్ చేశారంటూ కౌశల్ అంటాడు. నేను ముగ్గురిని అవుట్ చేశాను.. మూడు పాయింట్లు అని కౌశల్ అంటే.. ఒకసారి ఒకపాయింటే అని రష్మీ అంటుంది. మరీ నేను ముగ్గురిని అవుట్ చేశాను కదా? అని కౌశల్ అంటే.. ఎవరు అవుట్ చేయమన్నారు అని రష్మీ కౌంటర్ వేస్తుంది. అలా ఈ గొడవ మధ్యలోకి బుల్లెట్ భాస్కర్ తండ్రి వస్తాడు.

Bullet Bhaskar Father Satires on Anchor Rashmi in Sridevi Drama COmpany

Advertisement

ఆయన వచ్చి అవుట్ చేస్తే మీరే గెలిచినట్టు అని అంటారు. అలా కబడ్డీ కూతకు వెళ్లిన బుల్లెట్ భాస్కర్ తండ్రి అటే పడిపోతాడు. ఆయన అలా పడిపోవడంతో అందరూ షాక్ అవుతారు. ఆ ఆటను మధ్యలోనే ఆపేస్తారు. అయితే రష్మీ మాత్రం పెళ్లామ్స్ టీం గెలిచిందని అంటుంది.దీంతో బుల్లెట్ భాస్కర్ తండ్రి మళ్లీ రంగంలోకి దిగుతాడు. నువ్ అంతా తప్పుగా చెబుతున్నావ్.. నువ్ ఎవరు? అసలు ఇదంతా ఏంటి.. వాళ్లెందు నవ్వుతున్నారు.. డైరెక్టర్ ఎవరు? నీ కంటే ముందున్న యాంకర్ ఎక్కడ? అతన్నే తీసుకొద్దాం.. నువ్వేం సరిగ్గా చెప్పడం లేదు.. లేడీ యాంకర్ ఉంటే ఇలానే ఉంటుంది ఇలా అనుకుంటూ బుల్లెట్ భాస్కర్ తండ్రి రెచ్చిపోయాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి