
Bulli Raju : నిన్న వెంకీ .. ఇప్పుడు చిరు..బుల్లి రాజా మజాకా..!
Bulli Raju : ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన బుల్లి రాజు (రేవంత్) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. చిన్న వయస్సులోనే తన అద్భుతమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్న ఈ చిచ్చరపిడుగు, సినిమా విజయం తర్వాత వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు 20 సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినా, బుల్లి రాజు ఎలాంటి ప్రాజెక్ట్‌కి కమిట్ కాలేదు. తాజాగా అతను రోజుకు రూ. 1 లక్ష పారితోషికం అడుగుతున్నాడని, నిర్మాతలు కూడా అతనికి అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Bulli Raju : నిన్న వెంకీ .. ఇప్పుడు చిరు..బుల్లి రాజా మజాకా..!
ఇప్పుడు బుల్లి రాజు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బుల్లి రాజుకు ఓ కీలక పాత్ర లభించినట్టు సమాచారం. హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, అంజలి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయకపోయినా, జూన్ లేదా జూలైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఒక ట్యూన్ సిద్ధమయ్యిందని, ఈ పాటను ప్రముఖ గాయకుడు రమణ గోగుల ఆలపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేలా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ సినిమా, అనిల్ రావిపూడి కామెడీ టచ్, బుల్లి రాజు హాస్యంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత హైప్ ఏర్పడింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.