Chalapathi Rao death news viral
Chalapathi Rao : నవరస నట సౌర్వభౌమ కైకాల సత్యనారాయణ రావు ఆకస్మిక మరణం జీర్ణించుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాద వార్త అందరి మనసులని కొల్లగొట్టింది. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో అలరించిన చలపతి రావు గుండెపోటుతో ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. సుమారు 1200 కి పైగా సినిమాల్లో, మూడు తరాలకు చెందిన కథా నాయకులతో కలిసి నటించిన చలపతిరావు ఎక్కువగా నెగిటివ్ క్యారక్టర్లతో పరిచయం అయి ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లోనూ నటించి వైవిధ్యం చాటారు. తండ్రి, బాబాయి, మామయ్య, విలన్, సైడ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించిన చలపతి రావు ‘గూఢచారి 116’ ఆయన మొదటి సినిమా. 2021లో నాగార్జునతో కలసి నటించిన బంగార్రాజు ఆయన చివరి సినిమా అని చెప్పాలి. చలపతి రావు తన జీవితంలో ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు.
2018 టైంలో హీరో అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమా చేయగా, ఇందులో ఓ షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి కిందపడిపోయారు. దీంతో ఆయనకు గాయాల పాలు కాగా, చిత్ర బృందం వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్నారు. ఈ ప్రమాదం తర్వాతినుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు రాగా, కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. అలా ఇటీవల సినిమాలలో చాలా తక్కువగా కనిపించిన చలపతి రావు ఇలా కన్నుమూయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. చలపతి రావు గుండెపోటుతో మరణించినట్టు చెబుతుండగా, 2018 టైంలో హీరో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా వలన ఆయన మరణించారని కొందరు చెబుతున్నారు.
Chalapathi Rao death news viral
ఈ సినిమా షాట్‌లో చలపతి రావు బస్సు వెనకాల నిచ్చెన ఎక్కుతుండగా జారి కిందపడిపోగా, తీవ్ర గాయాలు కాగా చిత్ర బృందం వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించింది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకుంటుండగా, ఈ కారణం వలనే సినిమా షూటింగ్స్ కి దూరం అయ్యారు. అయితే ఆయన ఇప్పుడు ఆకస్మాత్తుగా మరణించడం ఎవరికి జీర్ణం కావడం లేదు. బంగార్రాజు సినిమాలో చలపాయ్ అంటూ నాగర్జున చేత పిలిపించుకున్నా, బాలకృష్ణ చేత సత్తిరెడ్డీ అంటూ పిలిపించుకున్నా.. ఆది సినిమా యన్టీఆర్ కేర్ టేకర్‌గా నటించినా… సై సినిమాలో నితిన్ తండ్రిగా జీవించినా.. అల్లరి నరేశ్ తో కలసి కామెడీ చేసినా..ప్రతి పాత్రలోను తన ప్రత్యేకత చాటుకున్నారు చలపతి రావు.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.