Chhaava : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన 'చావా'
Chhaava : విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ‘చావా’ సినిమా బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో నటించగా..ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న కనిపించింది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ నరేషన్ అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. కథ, నటన, నిర్మాణ విలువల పరంగా బాలీవుడ్‌లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ సెట్ చేయడం విశేషం. ‘చావా’ విజయంతో విక్కీ కౌశల్ తన కెరీర్‌లో మరొక మైలురాయి అందుకున్నాడు.
Chhaava : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన ‘చావా’
ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం 25 రోజుల్లోనే రూ.516 కోట్ల వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ చలనచిత్ర రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘చావా’ ఆరో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ రూ.510 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘చావా’ ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉంటె ఓటీటీ విడుదలపై భారీ ఆసక్తి నెలకొంది. ‘చావా’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెటిక్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్లో సినిమా కోసం ఉత్సాహం నెలకొంది. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం, ఓటీటీలోనూ అదే స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.