Home » Entertainment » Chiranjeevi Koratala Siva About Acharya Teaser
Entertainment

Acharya: ఆచార్య టీజర్ అప్డేట్.. చిరు కొరటాల ఆసక్తికర సంభాషణ

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 26, 2021, 10:29 pm
Advertisement

Acharya: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా అప్డేట్ రాబోతోందని గత కొన్ని రోజులుగా రూమర్లు వస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిరంజీవి ఓ అడుగు ముందుకు వేసి ఆచార్య టీజర్‌పై ఆసక్తికరంగా అప్డేట్ ఇచ్చాడు. చిరంజీవి ఇలాంటి స్పెషల్ అప్డేట్లను ఎలా లీక్ చేస్తాడో అందరికీ తెలిసిందే. చిరు తన్మయత్వంలో మునిగి తేలి ఆచార్య సినిమా టైటిల్‌ను అలానే లీక్ చేశాడు. ఆ సమయంలో కొరటాల, ఆచార్యపై లెక్కలేనన్ని మీమ్స్ వచ్చాయి.

Advertisement

Chiranjeevi koratala siva About Acharya Teaser

అలా నాడు తమపై జరిగిన ట్రోల్స్, వచ్చిన మీమ్స్ ఆధారంగా నేడు ఆచార్య అప్డేట్‌ను ఇచ్చాడు చిరంజీవి. చిరంజీవి స్పెషల్‌గా ఓ మీమ్‌ను క్రియేట్ చేశాడు. ఇందులో తనకు కొరటాల మధ్య సంభాషణను చిరంజీవి క్రియేటివ్‌గా ఎడిట్ చేశాడు. ఏమయ్యా కొరటాల ఆచార్య టీజర్ న్యూ ఇయర్‌కి లేదు.. సంక్రాంతికి లేదు.. ఇంకెప్పుడు అని కొరటాలను హెచ్చరించినట్టుగా చూపించాడు.

Advertisement

సర్ అదే పనిలో ఉన్నా.. అని కొరటాల భయపడుతూ చెప్పినట్టుగా ఉన్నాడు.. ఇప్పుడు చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా అని చిరు కౌంటర్ వేశాడు. రేపు మార్నింగే అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తా సర్ అని కొరటాల కాస్త బెరుగ్గా సమాధానం ఇచ్చినట్టున్నాడు. ఇస్తావ్ గా అని మరోసారి చిరంజీవి గదమాయించాడు.. అనౌన్స్ మెంట్ రేపు మార్నింగ్ పది గంటలకు ఫిక్స్ సర్ అంటూ ఆచార్య టీజర్ గురించి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆచార్య టీజర్ అప్డేట్ రేపు ఉదయం పది గంటలకు రాబోతోంది. అయితే ఈ అప్డేట్ కంటే.. అప్డేట్ ఇచ్చిన విధానం, ఆ మీమ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి