
Chiranjeevi : ఇంకొక భారీ మ్యాటర్ లీక్ చేసిన చిరంజీవి ..!
Chiranjeevi : చిరంజీవి సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. తన సినిమాలు లేదా కుటుంబానికి సంబంధించిన చిత్రాలు నిర్మాణంలో ఉన్నప్పుడు, అధికారికంగా వెల్లడించని కొన్ని విషయాలను పబ్లిక్ ఈవెంట్లలో అనుకోకుండా చెప్పేయడం చిరంజీవికి కొత్తేమీ కాదు. గతంలో ‘ఆచార్య’ విషయంలోనూ ఇలాంటి లీక్ ఇచ్చి చిత్రబృందానికి షాక్ ఇచ్చారు. తాజాగా ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లోనూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మెగా 158గా తెరకెక్కుతున్న సినిమాకు ‘కదిరి’ అనే టైటిల్‌ను చిరంజీవి స్వయంగా ప్రస్తావించడంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు ఈ పేరు ఎక్కడా అధికారికంగా బయటకు రాకపోవడంతో ఈ లీక్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగింది. అయితే ఇప్పుడు ‘కదిరి’ పేరు తెరపైకి రావడం వెనుక అసలు కారణమేంటన్నది ఆసక్తికరంగా మారింది. కదిరి అనంతపురం జిల్లాలోని ఓ పట్టణం. తెలుగు సినిమాలకు ప్రాంతాలు, పట్టణాలు, పుణ్యక్షేత్రాల పేర్లను టైటిల్స్‌గా పెట్టడం కొత్త విషయం కాదు. ‘అన్నవరం’, ‘భద్రాచలం’, ‘శ్రీశైలం’, ‘తిరుపతి’, ‘భద్రాద్రి’ వంటి పేర్లు కూడా గతంలో సినిమా టైటిల్స్‌గా వచ్చాయి. అయితే ఆయా సినిమాల్లో చాలా వరకు ఆ ప్రాంతాలతో కథకు ప్రత్యక్ష సంబంధం లేకపోవడం గమనార్హం. మరి ‘కదిరి’ టైటిల్‌కు కథతో ఎలాంటి సంబంధం ఉంటుందో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Chiranjeevi : ఇంకొక భారీ మ్యాటర్ లీక్ చేసిన చిరంజీవి ..!
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే వేడుకలో రీ-రికార్డింగ్ పూర్తయిందా అంటూ సంగీత దర్శకుడు తమన్‌ను చిరంజీవి ప్రశ్నించడం కూడా ఆసక్తిని రేకెత్తించింది. ఆ సందర్భంలోనే ‘కదిరి’ అనే పేరు బయటకు రావడం చూస్తుంటే, చిరంజీవి కావాలనే ఈ విషయాన్ని చెప్పారా? అనే చర్చ మొదలైంది. అయితే ఇది నిజంగానే టైటిల్ లీక్ అయిందా? లేక ప్రస్తుతానికి ‘కదిరి’ పేరును చెప్పి అసలు టైటిల్‌ను ఆగస్ట్ 22న ట్విస్ట్‌గా ప్రకటించబోతున్నారా? అన్నది కూడా ఆసక్తిగా మారింది. వీడియోను పరిశీలిస్తే చిరంజీవి కావాలనే చెప్పినట్టుగా అనిపిస్తోందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటీవలే దర్శకుడు బాబీ.. ఈ సినిమాకు సంబంధించిన లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ఈ లీక్‌పై మరింత ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం. దర్శకుడు బాబీ ఈ సినిమాను కోల్కతా బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా నేపథ్యంతో రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌కు కూడా పెద్దపీట వేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘గాడ్‌ఫాదర్’తో ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన తమన్.. ఈసారి చిరంజీవి కోసం ఎలాంటి ఆల్బమ్ సిద్ధం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ‘ఓజీ’ తరహా రేంజ్‌లో మ్యూజిక్ ఉండాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.మొత్తానికి అధికారిక ప్రకటనకు ముందే ‘కదిరి’ అనే పేరు బయటకు రావడంతో మెగా 158పై చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. నిజంగానే ఇదే టైటిల్‌నా? లేక చిరంజీవి ఇచ్చిన ఈ లీక్ వెనుక మరో ట్విస్ట్ ఉందా? అన్నది ఆగస్ట్ 22 వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది.
Vijayasai Reddy Vs Subba Reddy వైసీపీ మాజీ ఎంపీ, మాజీ ముఖ్య నేత వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా…
Hanuman Nagar Colony : ఉప్పల్‌లోని హనుమాన్ నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహం, ఐక్యత…
Vizag : విశాఖ బీచ్ అంటేనే ఆహ్లాదం, అందం, ఆహ్లాదకరమైన సముద్ర గాలి గుర్తుకొస్తాయి. నీలిరంగు కెరటాలను చూస్తూ గంటల…
Ys Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటన విషయంలో ఎదురుచూపులు తప్పడం…
Women's : ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఉద్యోగం లేదా సాధారణ…
Peanuts : వేరుశనగను చాలామంది సాధారణ స్నాక్‌గా చూస్తారు. కానీ ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-E, మెగ్నీషియం,…
Pawan Kalyan : స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో…
Chiranjeevi Vs Rajinikanth : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడం…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అలిగారా? సీఎం చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసనమండలి సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న…
Vishwanath And Sons Movie Review : కుటుంబ కథలు, భావోద్వేగాలు, ప్రేమ, వినోదం కలగలిసిన సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ…
Karthika Deepam 2 Today Episode August 14th : కార్తీక దీపం 2 ఆగస్టు 14 ఎపిసోడ్ 749:…
This website uses cookies.