chiranjeevi name changed what is the reason
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అద్భుతమైన నటన , స్టైలిష్ డ్యాన్స్‌తో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ రారాజుగా వెలుగొందుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా? అంటే అవుననక తప్పడం లేదు మరి. ఇందుకు పక్కా ప్రూఫ్ కూడా దొరకడంతో చిరంజీవి పేరు మార్పుకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి? చిరంజీవి పేరు మార్చుకున్నారా? ఇందుకు సంబంధించిన వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి అంటే దానికి కారణం గాడ్ ఫాదర్ మూవీ అప్‌డేట్ అని చెప్పాలి.
చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో చిరంజీవి పేరులో చిన్న మార్పు కనిపించడంతో ఒక్కసారిగా సినీ వర్గాల్లో ఇందుకు సంబంధించిన పలు చర్చలు మొదలయ్యాయి. గాడ్ ఫాదర్ టీజర్ లో EE కి బదులు అదనంగా మరో E పడటం కేవలం పొరపాటు మాత్రమే అని తెలిపారు చిత్ర యూనిట్. అంతేకానీ సోషల్ మీడియాలో వస్తున్నట్టు చిరంజీవి పేరు మార్చుకున్నాడు అనడంలో ఎలాంటి నిజం లేదని.. ఆ పొరపాటు వెంటనే సరిదిద్దుకున్నామని చెబుతున్నారు చిత్ర యూనిట్. సినిమాకి సంబంధించి సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా, దాన్ని కూడా జులై 7 నుంచి షూట్ చేస్తున్నారు.
chiranjeevi name changed what is the reason
మరోవైపు తలకోనలో జరగబోయే చిన్న షెడ్యూల్లో చిరంజీవి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. రాజకీయ ప్రయాణం అనంతరం తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. కాకపోతే ఇటీవల తన కుమారుడితో కలిసి చేసిన ఆచార్య సినిమా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు చిరు. వేదాళం తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అదేవిధంగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.