Home » Entertainment » Chiranjeevi Serious On Dilraj
Entertainment

Chiranjeevi : హనుమాన్ సినిమాకి కేవలం చాలా త‌క్కువ థియేటర్స్ ఇచ్చారు.. !

Authored By
Anusha V
The Telugu News | Updated on: January 8, 2024, 8:41 pm
Advertisement

Chiranjeevi : తేజా సజ్జా హీరోగా పాన్ ఇండియా సినిమా ‘ హనుమాన్ ‘ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. 12 భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. హనుమంతుడి పై ఉన్న భక్తిని చిరంజీవి ఈ సందర్భంగా పంచుకున్నారు.

Advertisement

హనుమాన్ సినిమా రిలీజ్ గురించి, థియేటర్ల గురించి చిరంజీవి మాట్లాడుతూ..ఇది పరీక్ష కాలం. థియేటర్లు అంతగా లభించకపోవచ్చు కానీ కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా కచ్చితంగా ఆడుతుంది. 2016లో ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ సినిమాలు వచ్చాయి. దిల్ రాజు ఆ టైంలో శతమానంభవతిని విడుదల చేశారు. ఏంటిది అని అడిగితే కంటెంట్ బావుంటే ఆడుతుంది అని ఆరోజు అన్నారు. అలాగే ఇప్పుడు కూడా హనుమాన్ సినిమా కూడా కచ్చితంగా ఆడుతుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇకపోతే సంక్రాంతికి హనుమాన్ సినిమాతో పాటు వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి రేసులో ఉండడంతో థియేటర్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇక హనుమాన్ సినిమాకి కేవలం 400 థియేటర్స్ మాత్రమే దక్కాయి అని సమాచారం. ఇక దిల్ రాజ్ గుంటూరు కారం సినిమాని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సంక్రాంతికి ఎప్పుడు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే వస్తాయి. కానీ ఈసారి చిన్న సినిమా అయినా హనుమాన్ సంక్రాంతి బరిలోకి దిగింది. ఆ స్టార్ హీరోలు అందరికంటే హనుమాన్ భారతదేశపు పెద్ద స్టార్ అని, ఆయనకు సంబంధించిన సినిమా కంటే ఏ సినిమా పెద్దది కాదని కొందరు అంటున్నారు. మరి సంక్రాంతికి వస్తున్న ఈ నాలుగు సినిమాలలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి