
Chiranjeevi
Chiranjeevi : టాలీవుడ్‌లో Tollywood మల్టీస్టారర్ సినిమాల ( Multistarrer movies )ట్రెండ్‌పై మరోసారి హాట్ డిస్కషన్ మొదలైంది. దీనికి కారణం మన శంకర వరప్రసాద్ గారి సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నారనే వార్త. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మల్టీస్టారర్ సినిమాల అవసరం వాటి విజయావకాశాలపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని మీరు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రాంచరణ్( Ram charan )కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం మెగా అభిమానులకు షాక్ ఇచ్చింది. ముగ్గురు కలిసి నటించడం వినడానికి ఎంత ఆసక్తికరంగా ఉన్నా, ప్రాక్టికల్‌గా అది చాలా కష్టమని చిరంజీవి స్పష్టంగా చెప్పారు.
మా ముగ్గురు కాంబినేషన్‌లో సినిమా రావాలి అంటే అది సాధ్యం కాని పని లాంటిదే. కథ ఎంపిక నుంచే పెద్ద సవాళ్లు ఉంటాయి. ముగ్గురికీ సమాన ప్రాధాన్యం ఇచ్చే కథ దొరకడం కష్టం. అంతేకాదు బడ్జెట్‌ను మ్యానేజ్ చేయడం కూడా పెద్ద సమస్య అవుతుంది అని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని సినిమా సాధ్యమైతే మాత్రం అభిమానులకు అది ఒక ఐఫీస్ట్‌లా ఉంటుందని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో ఆ కాంబినేషన్‌లో సినిమా రావడం కష్టమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్ గురించి పట్టించుకోకుండా కేవలం అభిమానుల ఆనందం కోసమే చేస్తే మాత్రం అది పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందని చిరంజీవి అన్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘మనం’ ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
Chiranjeevi : మెగా మల్టీస్టారర్ చర్చకు మళ్లీ ఊపొచ్చిందా?.. చిరంజీవి వ్యాఖ్యలు వైరల్
ఆ సినిమా ఎమోషన్, కథ, నటన పరంగా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. అదే తరహాలో మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒక మల్టీస్టారర్ సినిమా రావాలని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కానీ, చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే ఆ కోరిక ఇప్పట్లో అయితే నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తుండగా రాంచరణ్ ‘పెద్ది’ చిత్రంలో బిజీగా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు. ముగ్గురు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో మెగా మల్టీస్టారర్ సినిమా ఇప్పట్లో కష్టమేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా అభిమానుల ఆశ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై ప్రేక్షకుల్లో ఆసక్తి…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్‌తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
This website uses cookies.