chiranjeevi trolled by netigens
Chiranjeevi : చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన చిరు ఇప్పటికీ కుర్రహీరోలతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు. చివరిగా ఆచార్య సినిమాతో ప్రేక్షకులని పలకరింగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంతో పలకరించబోతున్నాడు. అయితే చిరంజీవి ఇటీవల కాలంలో చేసే కామెంట్స్, మాట్లాడే మాటలు కాంట్రవర్సీలుగా మారతున్నాయి. ఇప్పటికే రెండు మూడు సార్లు కొరటాలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా చిరు విమర్శలు చేయడం చాలామందికి నచ్చ లేదు
తాజాగా ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో సైతం డైరెక్టర్ ఏది చెబితే అదే తాము చేశామని చిరు చెప్పారు. అంటే సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ చిరంజీవి తీసుకుని.. ప్లాప్ అయితే మాత్రం దర్శకుడు ఖాతాలో తోసేస్తారా ? అని చిరు యాంటీ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే చిరంజీవిని .. మహేష్, ఎన్టీఆర్‌లతో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్లాప్ అయినందుకు తనదే ప్రధాన బాధ్యత అని… హిట్ అయితే ఆ క్రెడిట్ అందరికీ దక్కుతుందని మహేష్ బాబు చెప్పాడు. మరో సందర్భంలో మహేష్ బాబు గురించి దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ దూకుడు సినిమా అంత పెద్ద హిట్ అవ్వటం ఆ క్రెడిట్ దర్శకుడు శ్రీనువైట్లకి చెందుతుందని…
chiranjeevi trolled by netigens
అతడు చెప్పినట్టే తాను చేశానని మహేష్ అన్నాడు. బిజినెస్ మాన్ విషయంలోనూ క్రెడిట్ అంతా పూరి జగన్నాథ్ కే ఇచ్చాడని… మహేష్‌లో ఉన్న గొప్ప లక్షణం ఇదే అని దాసరి కొనియాడిన వీడియోను కూడా ఇప్పుడు నెటిజన్లు షేర్ చేస్తూ చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌కి కూడా గతంలో ఫ్లాపులు రాగా,ఆయన ఎప్పుడు ఆ తప్పుని దర్శకులపై నెట్టలేదు. యంగ్ హీరోలు అంత మెచ్యురిటీగా ఆలోచిస్తుంటే చిరంజీవి లాంటి స్టార్ హీరో అలా చేస్తున్నాడేంటని కొందరు ఫైర్ అవతున్నారు.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.