clarity on mokshagna Tollywood entry
Mokshagna: గత కొద్ది రోజులుగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మూవీ లాంచింగ్‌కి సంబంధించి జోరుగా ప్రచారాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు …ఇప్పుడు అంటున్నా ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతోంది. ఈ క్రమంలో బాలయ్య తన వారసుడు ఎంట్రీ కోసం డైరక్టర్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. బాలయ్య 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు ఎదురుచూపులే మిగిలాయి. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ప్రకటించి అభిమానులకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం ఆ వైపుగా అడుగులేస్తున్నట్లు సమాచారం.
ఇక ఆ మధ్యన మోక్షజ్ఞ లాంచ్‌ప్యాడ్ ప్రాజెక్ట్‌కి పూరి జగన్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే పూరీ ఇతర కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉండటంతో అది కష్టమైపోయింది. అలాగే బాలయ్య బాబు హీరోగా వచ్చి అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ‘ఆదిత్య 369’ సీక్వల్‌తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అంతా భావించారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా ఫినిష్ అయ్యింది. అదీ మెటీరియలైజ్ కాలేదు. మరో ప్రక్క మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతను బోయపాటి తీసుకున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
clarity on mokshagna Tollywood entry
తనకు హాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్‌తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగాలని సెంటిమెంటల్‌గా బాలయ్య ఫిక్సయ్యారట. అది అదీ నిజం కాలేదు. దానికి తోడు మోక్ష కూడా తన షేప్‌ను కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఫుల్ షేప్ కు వచ్చారట. దీంతో త్వరలోనే అతని చిత్రం ప్రారంభం అవుతుందని క్లారిటీ వచ్చేసింది. మరి ఎవరు ఆ డైరక్టర్ అంటే…అనీల్ రావిపూడి అని తెలుస్తోంది. అనీల్ రావిపూడి అయితే హీరోని సేఫ్ గా లాంచ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చి …తన హీరోతో కామెడీ నుండి ఫైట్స్ , రొమాన్స్ అన్నీ చేయిస్తూ ఉంటారు. కాబట్టి, మోక్షజ్ఞ ప్రతిభను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించాలంటే ఆ దర్శకుడే ఫెరఫెక్ట్ అని డిసైడ్ అయ్యారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.