clarity on prabhas love
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి, ఎఫైర్స్ ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. అనుష్కని పెళ్లి చేసుకోబోతున్నాడని ఎప్పటి నుండో ప్రచారం నడుస్తుంది. అయితే అదంతా అవాస్తమని వారు చెబుతున్నా కూడా పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ ని ఇష్టపడుతున్నాడని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం నడుస్తుంది. ప్రభాస్-కృతి సనన్ జంటగా ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతుండగా, ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో రామునిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆదిపురుష్ సెట్స్ వేదికగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వాదన నడుస్తుండగా, వీరిద్దరి రిలేషన్‌పై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. వరుణ్ ధావన్-కృతి జంటగా బేడియా టైటిల్ తో మూవీ చేయగా, ఈ మూవీ నవంబర్ 25న థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా ఉన్న కరణ్ జోహార్.. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని అడగ్గా.. దానికి స్పందించిన వరుణ్.. కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ఇప్పుడు ముంబైలో లేడు.
clarity on prabhas love
మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో పాల్గొంటున్నాడని తెలిపాడు. వరుణ్ కామెంట్స్ కి కృతి కాస్త ఇబ్బందిగా ఫీలైంది. వరుణ్ ధావన్ హింట్ ప్రకారం ప్రభాస్ గుండెల్లో కృతి పేరున్నట్టుగా భావిస్తున్నారు. ప్రభాస్ హైద్రాబాదు లో దీపికా పదుకొనె తో పాటు ప్రాజెక్ట్ కే షూట్ లో పాల్గొంటున్నాడని స్ఫష్టంగా అర్థం కావడంతో ప్రభాస్- కృతి ప్రేమాయణం ఫిక్స్ అని డిసైడ్ అవుతున్నారు నెటిజన్స్. ప్రభా్ ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు కాగా, 2017 లో బాహుబలి 2 విడుదల అయినప్పటి నుండి తరచుగా పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. అనుష్కతో పెళ్లి వార్తలను ఖండించిన ఆయన కృతి సనన్ వ్యవహారంలో ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.