Home » Entertainment » Comedian Naresh In Sridevi Drama Company
Entertainment

Naresh : కమెడియన్ నరేష్‌ను ఉతికి ఆరేసింది!.. చితక్కొట్టేసిన సీరియల్ నటి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 7, 2021, 8:20 pm
Advertisement

Naresh : బుల్లితెరపై కమెడియన్ నరేష్ చేసే కామెడీ ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసిందే. ఆకారం చిన్నదే అయితే కామెడీ మాత్రం పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ఒకప్పుడు నరేష్, నెమలిరాజు మధ్య కోల్డ్ వార్ జరిగేది. కానీ నెమలి రాజు జీ తెలుగుకు షిఫ్ట్ అయ్యాడు. అలా నరేష్‌కు ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు నరేష్ జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ దుమ్ములేపుతున్నాడు.

Advertisement

నరేష్ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను కూడా నిద్రలేపుతున్నాడు. ఈ మధ్య షబీనాతో నరేష్ రొమాన్స్ చేసేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాడు. చూసేందుకు చిన్నగానే ఉన్నా.. నరేష్ వయసు దాదాపు 22 ఏళ్లు ఉంటుంది. అలా షబీనాతో నరేష్ చేసే రొమాన్స్ మీద రోజా కూడా సెటైర్లు వేస్తుంటుంది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో నరేష్‌కు దిమ్మతిరిగిపోయింది.

Comedian Naresh In Sridevi Drama Company

Advertisement

Naresh : నరేష్‌ను చితకబాదిన నటి..

సీరియల్ ఆర్టిస్ట్ ఒకరు గెస్టుగా వచ్చింది. ఆమె నరేష్‌ను ఉతికి ఆరేసింది. దబాదబా వాయించేసింది. చెంప మీద కొట్టేసింది. ఒక్కసారిగా జడివాన కురిసినట్టుగా దెబ్బల వర్షం కురిపించింది. దీంతో ఏం జరిగిందో తెలియక నరేష్ షాక్ అయ్యాడు. మళ్లీ ఒకసారి కొట్టేందుకు వెళ్లగా.. నరేష్ స్టేజ్ దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. మొత్తానికి నరేష్‌ను అందరూ ఇలా వాడేసుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి