
deepthi sunaina and shanmukh jaswanth love story fans happy
Deepthi Sunaina : యూట్యూబ్ స్టార్స్ గా గుర్తింపు దక్కించుకున్న షన్నూ మరియు దీప్తి సునైనా లు ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నారో అందరికి తెల్సిందే. వీరిద్దరు ప్రేమలో ఉన్న సమయంలో వారిద్దరి జంటను చూస్తే చాలా ముచ్చటేసేది. ఎన్నో టీవీ కార్యక్రమాల్లో వారు కనిపించారు. సందడి చేశారు.. ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్లుగానే ప్రవర్తించే వారు. కానీ బిగ్ బాస్ నుండి షన్నూ బయటకు వచ్చిన తర్వాత అంతా కూడా షాక్ అయ్యేలా దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసింది.. ఆమె నిర్ణయాన్ని తాను గౌరవిస్తాను. ఆమె అంటే తనకు చాలా ఇష్టం.. ఆమె నుండి చాలా విషయాలను నేర్చుకున్నాను అంటూ షన్నూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి బ్రేకప్ ను అంగీకరిస్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా కాస్త ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది.
ఆ విషయం ప్రతి ఒక్కరిని బాధ కు గురి చేసింది.ఇద్దరు కలిసి ఉంటే బాగుండేది కదా అంటూ చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. ఎట్టకేలకు ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందా అంటే ఔను అనే సమాధానంను అభిమానులు బలంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వైజాగ్ లో దీప్తి సునైనా మరియు షన్నూ లు ఒక కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది. కారణం దీప్తి మరియు షన్నూ లు కలిసి కనిపించడం. స్టేజ్ పై ఇద్దరు కలిసి కనిపించారు. మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు కానీ జనాలు ఆ వ్యక్తిని చూడకుండా వారిద్దరు కలిసి స్టేజ్ పై ఉన్నట్లుగానే భావించారు. ఆ సమయంలో షన్నూ గురించి దీప్తి మాట్లాడింది. ఇక షన్నూ అయితే చాలానే దీప్తి గురించి మాట్లాడాడు. దీప్తి సునైనా కూర్చుని ఉన్న సమయంలో వచ్చిన షన్నూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
deepthi sunaina and shanmukh jaswanth love story fans happy
ఇద్దరు కూడా చూసుకున్నారు.. కాస్త సన్నగా నవ్వుకున్నారు. లేట్ గా బయటకు వచ్చిన ఈ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరిని ఆ కార్యక్రమంలో చూసిన ఎవరైనా ఒకరంటే ఒకరికి కోపం తగ్గినట్లుగా అనిపిస్తుందని.. త్వరలోనే వీరిద్దరిని ఆన్ స్క్రీన్ పై మరియు ఆఫ్ స్క్రీన్ లో కూడా చూస్తాం అన్నట్లుగా అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా జీవితాంతం విడి పోవాలి అనుకోరు. షన్నూ చేసిన తప్పులకు అతడు అనుభవించిన వేదన సరిపోయింది. కనుక దీప్తి ఇప్పుడు అతడి ని చేరే అవకాశాలు ఉన్నాయి.. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం వారిద్దరు తాజాగా పాల్గొన్న కార్యక్రమం అంటూ అభిమానులు ధీమాతో ఉన్నారు. ఏం జరగబోతుందో చూడాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.