Home » Entertainment » Deepthi Sunaina Black Saree Video Viral
Entertainment

Deepthi Sunaina : బ్లాక్ సారిలో కూల్ గా ఆడిపాడుతున్న దీప్తి సునయన

Authored By
mallesh
The Telugu News | Published on: April 11, 2022, 10:00 pm
Advertisement

Deepthi Sunaina : సోష‌ల్ మీడియాతో సెల‌బ్రిటిగా మారి బిగ్ బాస్ చాన్స్ కొట్టేసిన దీప్తి సునైనా అంద‌రికి ప‌రిచ‌య‌మే.. డ‌బ్ స్మాష్ వీడియోల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప‌లు తెలుగు సినిమాల్లో కూడా న‌టించింది. యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ తో క‌లిసి సాంగ్స్ షార్ట్ వీడియోస్ చేసింది. యూట్యూబ్‌ సెలబ్రెటీలు అయిన వీరిద్దరు బిగ్‌ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇద్దరు కూడా వేరు వేరు సీజన్ ల్లో బిగ్‌ బాస్ లో కనిపించి ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో పలు రకాల యాప్‌లలో, యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయ్యారు దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ వీడియోలు చేశారు. వాటికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. కొన్నింటిలో దీప్తీని లీడ్‌గా పెట్టి.. అతడు వెనకుండి వాటిని నడిపించాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది.సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె..

deepthi sunaina Black Saree Video Viral

Advertisement

ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.సుదీర్ఘ కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ష‌ణ్ముఖ జ‌శ్వంత్ బిగ్ బాస్ ఎపిసోడ్ త‌ర్వాత ఈ న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. బ్రేకప్ తర్వాత తేరుకుని సోష‌ల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటోంది. అలాగే ఫొటోలు వీడియోలు షేర్ చేస్తోంది. తాజాగా బోటులో వెళ్తున్న వీడియో ఒక‌టి త‌న ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఓ సాంగ్ కి ఫీల్ అవుతూ ఫోజులిస్తోంది ఆ వీడియోలో. బ్లాక్ సారిలో కూల్ గా క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ వీడియోకి ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి