Home » Entertainment » Deepthi Sunaina Dance Video Viral 2
Entertainment

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. గ్యాంగ్‌తో క‌లిసి తెగ ర‌చ్చ చేస్తుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: February 26, 2022 9:36 am
Advertisement

Deepthi Sunaina : యూట్యూబ‌ర్‌గా దీప్తి సున‌యన క్రేజ్ మాములుగా లేదు. ముఖ్యంగా ష‌ణ్ముఖ్ తో ప్రేమాయ‌ణం త‌ర్వాత ఈ అమ్మ‌డు తెగ వార్త‌లలో నిలుస్తుంది. ఐదేళ్ల త‌ర్వాత ష‌ణ్ముఖ్ కి బ్రేక‌ప్ చెప్పిన త‌ర్వాత దీప్తి సున‌య‌న సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ అమ్మ‌డు త‌న గ్యాంగ్‌తో క‌లిసి తెగ డ్యాన్స్‌లు చేస్తుంది. ఇటీవ‌ల తెగ ర‌చ్చ చేస్తున్న దీప్తి సున‌య‌న వాసివాడి త‌స్సాదియ్యా పాట‌కు అద్దిరిపోయే జోష్‌తో డ్యాన్స్ చేసింది. దీప్తి సున‌య‌న జోష్‌కి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ బ్యూటీ ఫుల్ వీడియోపై స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ చెప్పిన తరువాత దీప్తి సునయనలో చాాలా మార్పు వచ్చింది. చాలా యాక్టివ్ అయిపోయింది. అందరిలో కలిసి సందడి చేస్తోంది. ప్రేమ విఫలమైన బాధను దీప్తి సునయన కనిపించకుండా కవర్ చేస్తోంది. మరో వైపు షన్ను మాత్రం తన ప్రేమను, బ్రేకప్ బాధను గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. బీబీ జోడి ఈవెంట్‌లోనూ షన్ను బ్రేకప్ పాటకే డ్యాన్స్ వేశాడు. బిగ్‌బాస్‌5 లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న షణ్ముఖ్‌ జస్వంత్‌ ప్రియురాలే దీప్తి సునైనా. బిగ్‌బాస్‌2 సీజన్‌లో పాల్గొని సందడి చేసింది. అందరి హృదయాలను గెలుచుకుంది.దీప్తి సునైనా పలు టీవీ షోలల్లోనూ సందడి చేస్తుంది. యూట్యూబ్‌ వీడియోలు, వీడియో కవర్‌ సాంగ్‌ల్లోనే కాదు,

deepthi sunaina dance video viral

Advertisement

Deepthi Sunaina : దీప్తి ప‌ర్‌ఫార్మెన్స్ అదుర్స్..

అవకాశం వచ్చినప్పుడల్లా టీవీ షోస్‌లో తనదైన డాన్సులు, నటనతో మెస్మరైజ్‌ చేస్తుంది. దీప్తి సునైనాకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆమె ఫోటోలను చూసేందుకు నెటిజన్లు క్యూ కడతారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాలో మూడు మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. దీప్తి చేసే ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా తెగ షేక్ అవుతుంది. కాగా, దీప్తి సున‌యన‌-ష‌ణ్ముఖ్‌కి యూట్యూబ్‌లో, సిరీస్‌లో ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతేకాదు ఎంతో కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. అయితే చిన్న కారణాలకే ఈ యూట్యూబ్‌ జంట విడిపోవడం వారి ఫాలోవర్స్‌ను బాధించింది. దీంతో మళ్లీ వీరిద్దరూ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ తెగ కోరుకుంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి