Home » Entertainment » Deepthi Sunaina New Looks Are Stunning
Entertainment

Deepthi Sunaina : దీప్తి సున‌య‌న అస్స‌లు త‌గ్గ‌ట్లేదు.. అందాల ఆర‌బోత‌కు పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Published on: March 26, 2022, 10:00 am
Advertisement

Deepthi Sunaina : ఇటీవ‌లి కాలంలో దీప్తి సున‌య‌న పేరు తెగ మారుమ్రోగిపోతుంది.ముఖ్యంగా ష‌ణ్ముఖ్‌తో బ్రేక‌ప్ అయ్యాక దీప్తి హంగామా మాములుగా లేదు. బిగ్‌బాస్ 2 సీజన్‌లో యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన చేసిన అల్లరిని మరిచిపోలేరు. ఆ సీజన్‌లో ఆమె చూపిన ఆటిట్యూట్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాతో స్టార్ అయిన ఈ పిల్ల.. ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయేలా, తెలుగుదనం ఉట్టిపడేలా పోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. అసలు దీప్తిని ఇటీవ‌లి కాలంలో ఇలా చూడ‌లేదంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువ‌గా హాఫ్ శారీలోనో లేదా శారీలో ద‌ర్శ‌న‌మిస్తుండే దీప్తి ఒక్క‌సారిగా త‌న గెట‌ప్ ఎందుకు ఇలా మార్చిందా అని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్‌గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్.. హౌస్‌లో సిరికి క్లోజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకుని బాగా దగ్గరయ్యారు. హగ్‌లు ముద్దులతో బిగ్ బాస్ హౌస్‌ని హీటెక్కించి సీజన్ మొత్తానికి మసాలా ఆర్టిస్ట్‌లు అయ్యారు. అయితే అప్పటికే షణ్ముఖ్‌తో ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉన్న దీప్తి సునయన రీసెంట్‌గా అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే షణ్ముఖ్ సిరికి క్లోజ్ కావడంతో దీప్తిని పట్టించుకోవడం మానేశాడని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అస‌లు కార‌ణం ఏంట‌న్న‌ది ఇంత‌వ‌ర‌కు ఎవ‌రికి తెలియ‌దు.

deepthi sunaina new looks are stunning

Advertisement

Deepthi Sunaina : దీప్తి త‌గ్గ‌ట్లేదుగా..

బిగ్‏బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షణ్ముఖ్ సిరితో ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు. బిగ్‏బాస్ జర్నీలో వీరిద్దరి శ్రుతిమించిన ప్రవర్తన, హగ్గులు, ముద్దులు ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. ఇరువురి కుటుంబసభ్యులు వచ్చి హగ్గులు తగ్గించండి అని చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. అలాగే ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ చెప్పడంతో వీరిద్దరిపై మరింత నెగిటివిటి పెరిగింది. ఇవే కాకుండా.. ప్రతిసారి సిరిని షణ్ముఖ్ కంట్రోల్ చేయడం.. ఆమె ఎవరితో మాట్లాడిన సహించలేకపోవడం.. చూపులతోనే సిరిని కంట్రోల్ చేయడం వంటివి షణ్ముఖ్ ఇమేజ్‏ను భారీగా డ్యామేజ్ చేశాయి. దీప్తి కూడా అత‌ని నుండి విడిపోవ‌డం ష‌ణ్ముఖ్‌ని మ‌రింత బాధించింది. వీరు ఇప్ప‌ట్లో క‌ల‌వ‌డం క‌ష్ట‌మే అంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి