Home » Entertainment » Deepthi Sunaina Shanmukh Issue Enter Into Bigg Boss 6 Telugu Contestants
Entertainment

Deepthi Sunaina Shanmukh : ష‌ణ్ముఖ్‌ దీప్తి సునైనాని క‌లిపేందుకు మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌నున్న మ‌రో బిగ్ బాస్ కంటెస్టెంట్..!

Authored By
Sam C
The Telugu News | Published on: January 12, 2022, 7:00 pm
Advertisement

Deepthi Sunaina Shanmukh : బిగ్ బాస్ షో కొంద‌రికి పాజిటివ్‌గా మారితే, మ‌రి కొంద‌రికి నెగెటివిటీ మూట‌గ‌ట్టుకునేలా చేస్తుంది. బిగ్ బాస్ వ‌ల‌న ష‌ణ్ముఖ్ లాభ ప‌డిందేమో తెలియ‌దు కాని, ఇన్నాళ్లు ప్రాణంగా ప్రేమించిన దీప్తిని కోల్పోయాడు. బిగ్ బాస్ ఇంటి నుంచి షణ్ముఖ్ బయటకు వచ్చిన తరువాత దీప్తి అస్సలు పట్టించుకోలేదు. లైవ్‌లోకి వచ్చిన షన్నుని అందరూ దీప్తి గురించే అడిగారు. దీంతో దీప్తి తనను బ్లాక్ చేసిందని, తనకు కోపం వచ్చినప్పుడు ఇలానే చేస్తుందని, తను బ్లాక్ చేసినంత మాత్రాన నేను వదిలిపెట్టను అని షన్ను చెప్పుకొచ్చాడు.

Advertisement

Deepthi Sunaina Shanmukh : వాళ్లు మ‌ళ్లీ క‌ల‌వాలి అంటూ అనీ మాస్ట‌ర్ కామెంట్

షణ్ముఖ్ దీప్తి విడిపోవ‌డం వారి అభిమానుల‌ని ఎంతగానో క‌ల‌చివేస్తుంది. వారిద్ద‌రిని క‌లిపేందుకు స‌న్నిహితులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అయినటువంటి అనీ మాస్టర్ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… “వారిది ఓ ముచ్చటైన జంట. వారు విడిపోవడం మీకు మాత్రమే కాదు.. నాకు కూడా చాలా బాధిస్తోంది. ఆ దేవుడు వారిని చక్కగా చూడాలి. వారు మళ్ళీ కలవాలి.” అని అనీ సమాధానం ఇచ్చింది. మ‌రి ఈమె వారిద్ద‌రిని క‌లిపే ప్ర‌య‌త్నాలు ఏమైన చేస్తుందా అనే దానిపై కొందరు అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి