Home » Entertainment » Deepti Sunaina Enjoyment Video Viarl
Entertainment

Deepthi Sunaina : కుక్క పిల్ల‌లా అరుస్తూ చిలిపి చేష్ట‌లు చేస్తున్న దీప్తి సున‌య‌న‌.. ఎంజాయ్‌మెంట్ మాములుగా లేదుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 23, 2022, 10:00 am
Advertisement

Deepthi Sunaina : బ్రేక‌ప్ త‌ర్వాత అందాల ముద్దుగుమ్మ‌లు సోష‌ల్ మీడియాలో భ‌లే ర‌చ్చ చేస్తున్నారు. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావిడి చేస్తుంది. ఇక యూట్యూబ్ స్టార్ దీప్తి సున‌య‌న‌.. ష‌ణ్ముఖ్‌కి బ్రేక‌ప్ చెప్పాక సోష‌ల్ మీడియాలో మాములు హంగామా చేయ‌ట్లేదు. ప‌లు సాంగ్స్‌కి డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంది. దీప్తి సునైనా.. యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.

Advertisement

ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు.బిగ్ బాస్ సీజ‌న్ 5 త‌ర్వాత ఇద్ద‌రు విడిపోయారు. ఎవ‌రి లైఫ్ వారిది అన్న‌ట్టుగా ఉంటున్నారు. ష‌ణ్ముఖ్ నుండి విడిపోయిన త‌ర్వాత దీప్తి సున‌య‌న అయితే సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావిడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు ఓ రీల్ చేసింది. ఇందులో కుక్క‌పిల్ల‌లా అరుస్తూ సౌండ్స్ చేసింది. దీప్తి చేస్తున్న చిలిపి చేష్ట‌లు న‌వ్వు తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది.

Deepti Sunaina Enjoyment video Viarl

Advertisement

Deepthi Sunaina : ఇది క‌దా దీప్తి అంటే…

దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి