Home » Entertainment » Devayani And Sakshi Plan Against Rishi In Guppedantha Manasu
Entertainment

Guppedantha Manasu : రిషి, వసు ప్రేమ విషయం దేవయానికి తెలుస్తుందా? ఇద్దరినీ విడదీసేందుకు సాక్షి, దేవయాని వేసే ప్లాన్ ఏంటి?

Authored By
Varun G
The Telugu News | Updated on: August 28, 2022, 9:32 am
Advertisement

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 29 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడూ 541 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసు, రిషి ఇద్దరూ కారులో బయలుదేరుతారు. వసుధర.. ఈ ప్రయాణంలో ఏదో కొత్తదనం, ఎంత హాయిగా ఉందో కదా అంటాడు రిషి. చూశావా.. నువ్వు చెప్పాల్సింది నేను అంటున్నాను. ఎప్పుడూ ఇలా విశ్లేషించడం నీకు అలవాటు కదా అంటాడు రిషి. సార్.. నేను చెబితే మీకు బాగుండేది. ఇప్పుడు మీరు చెబుతుంటే నాకు చాలా బాగుంది అంటుంది వసుధర. ఏం ఆలోచిస్తున్నావు అంటాడు రిషి. నువ్వు ఏం అనుకుంటున్నావో నన్ను చెప్పమంటావా అంటాడు రిషి. ఈ రిషి సార్ ను కలిసిన మొదట్లోనే గొడవలు మొదలై.. తర్వాత గొడవలు తగ్గి ఇద్దరం ఒక్కటైపోయాం అని అనుకుంటున్నావు కదా అంటాడు రిషి. దీంతో అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేశారు సార్ అంటుంది వసుధర. ఆ తర్వాత తన రూమ్ వచ్చేస్తుంది. వెళ్లి ఈరోజు రెస్ట్ తీసుకో. రేపటి నుంచి నీ ధ్యాస మొత్తం చదువు మీదనే ఉండాలి. ఓకేనా అంటాడు రిషి. దీంతో ఓకే సార్ అని చెప్పి వెళ్లిపోతుండగా తన చేయి పట్టుకుంటాడు రిషి.

Advertisement

devayani and sakshi plan against rishi in guppedantha manasu

బెస్ట్ ఆఫ్ లక్ అంటాడు రిషి. థాంక్స్ చెప్పమంటారా? మీరు నా ఆశయం కోసం నన్ను.. ఎందుకు లెండి అంటుంది వసు. గుడ్ నైట్ అని చెప్పి వెళ్లిపోతుంది వసుధర. తను వెళ్లిపోయాక.. కారులో వెళ్తూ ఒక చోట కారును ఆపి చాలా సంతోషంగా ఉంటాడు రిషి. నువ్వెప్పుడు ఇలాగే ఉండు. ఇలాగే నిబ్బరంగా, సహనంగా నిలబడు. సమస్యలు వచ్చినా సంతోషం వచ్చినా ఒప్పుకో. వసుధర నీది. నువ్వు తన ప్రాణం. తన ఆశయం నువ్వే నిలబెట్టు. మిస్టర్ రిషీంద్ర భూషణ్. జంటిల్ మెన్ గా ఉండు అని చెప్పి తనకు తాను చెప్పుకుంటాడు రిషి. మరోవైపు రిషి గురించి మహీంద్రా, గౌతమ్ ఆలోచిస్తూ ఉంటారు. రిషి గురించి ఎంత ఆలోచించినా ఏం అర్థం కావడం లేదు అంటాడు గౌతమ్. ఇంతలో రిషి వస్తాడు. వాడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడే అడిగేద్దాం అంటాడు గౌతమ్.

Advertisement

దీంతో నువ్వు అడుగుతావా.. నేను అడగనా అంటాడు మహీంద్రా. దీంతో మీరు పెద్దవారు కదా.. మీరు అడిగితేనే బాగుంటుంది అంటాడు గౌతమ్. వద్దు.. నువ్వే అడిగేయ్ అంటాడు. దీంతో రారా.. కాసేపు కబుర్లు చెప్పుకుందాం అంటాడు గౌతమ్. దీంతో నేను అలిసిపోయాను అంటాడు రిషి. రేపు మాట్లాడుకుందాం అంటాడు రిషి.

Guppedantha Manasu : జగతిని చూసి థాంక్స్ చెప్పిన రిషి

రిషి వెళ్లిపోబోతుండగా జగతి కనిపిస్తుంది. తనను చూస్తూ అలాగే ఉండిపోతాడు. తెగిపోయిన బంధం నాకు మరో ఆనందాన్ని, అనుభూతిని అందించింది అని అనుకుంటాడు. థాంక్యూ మేడమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు రిషి  గురించే ఆలోచిస్తూ ఉంటుంది వసు.

Advertisement

మరోవైపు రిషి కూడా వసు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరూ ఒకరిని మరొకరు గుర్తు చేసుకుంటారు. ఒకరికి మరొకరు మెసేజ్ చేసుకుందాం అని అనుకుంటారు కానీ.. చేసుకోరు. ఆ తర్వాత వసును డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంటాడు. అందుకే ఫోన్ చేయొద్దు అని అనుకుంటాడు.

మరోవైపు రిషిని ఎలా మనవైపునకు తిప్పుకోవాలి అని దేవయాని, సాక్షి ఆలోచిస్తారు. రిషి నన్ను చాలా అవమానించాడు. ఉంగరంలో వీ అనే అక్షరంతో చేయిస్తాడా అంటూ సీరియస్ అవుతుంది సాక్షి. దీంతో కొన్ని రోజులు ఆగు. పరీక్షలు అయిపోయిన తర్వాత ఇద్దరూ దూరం అవుతారు.

ఆ తర్వాత మనం రిషిని మనవైపునకు తిప్పుకోవచ్చు అంటుంది దేవయాని. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి