Home » Entertainment » Devayani Gets Shocked As Rishi Brings Vasudhara To Home
Entertainment

Guppedantha Manasu : వసుధారను ఇంట్లోనే పెట్టుకున్న రిషి.. మా ఇద్దరికీ పెళ్లి చేయి అని దేవయానితో అన్న రిషి.. దీంతో దేవయాని షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Updated on: December 18, 2022, 9:14 am
Advertisement

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదల కాదు. సీరియల్ సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు 19 డిసెంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 637 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను మా ఇంటికి వెళ్లిపోతాను సార్. అసలు మీ ఇంట్లో ఏ హక్కుతో ఉండాలి అని వసుధార.. రిషితో అనడంతో తన చేయి పట్టుకొని డైరెక్ట్ గా ఇంటికే తీసుకొని వస్తాడు. మరోవైపు రిషినే దేవయాని వదినకు మంచి సమాధానం చెబుతాడని మహీంద్రా.. జగతితో అంటాడు. ఇంతలో పెద్దమ్మ, డాడ్, మేడమ్ అంటూ అందరినీ గుమ్మం ముందర నిలబడి పిలుస్తాడు. దీంతో అందరూ అక్కడికి వస్తారు. అందరూ అక్కడికి రాగానే.. వసుధార చేయి పట్టుకుంటాడు.

Advertisement

devayani gets shocked as rishi brings vasudhara to home

దీంతో అందరూ షాక్ అవుతారు. నేను వసుధారను పెళ్లి చేసుకుంటే మీకేమైనా అభ్యంతరమా? అని అడుగుతాడు రిషి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అందరినీ అడుగుతాడు. పెద్దమ్మ మీరు చెప్పండి అంటాడు. దీంతో నాకేం ప్రాబ్లమ్ లేదు అంటుంది దేవయాని. పెదనాన్న నీకు అని అడుగుతాడు. దీంతో నాకు ఓకే రిషి అంటాడు. ఆ తర్వాత మహీంద్రాను అడుగుతాడు. జగతిని అడుగుతాడు. అందరూ ఓకే అంటారు. మా పెళ్లి త్వరగా చేసేయండి పెద్దమ్మ అని చెబుతాడు రిషి. దీంతో దేవయానికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పటి వరకు వసుధార ఇక్కడే ఉంటుందని చెబుతాడు. దీంతో దేవయానికి ఏం చేయాలో అర్థం కాదు.

Advertisement

కానీ.. అందరి ముందు నటిస్తుంది దేవయాని. నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తా అంటుంది. మీకు ఏం కావాలో నాకు తెలుసు. నేను ఏం చేయాలో నువ్వు అడగాలా? నా మనసులో ఉన్నది నేను తప్పక చేస్తాను అంటుంది దేవయాని. దీంతో మంచి మాట చెప్పావు దేవయాని అంటాడు ఫణీంద్రా.

Guppedantha Manasu : వసుధారకు వెల్ కమ్ చెప్పిన ధరణి

ఇంకెందుకు ఆలస్యం పెళ్లి పనులు మొదలుపెడదాం అంటాడు ఫణీంద్రా. దీంతో అవును వదిన గారు.. పెళ్లి పనులు వెంటనే ప్రారంభిద్దాం అంటాడు మహీంద్రా. దీంతో ఏంటి మహీంద్రా.. పెళ్లి అంటే మాటలా చెప్పు. ఎన్ని సిద్ధం చేసుకోవాలి. టైమ్ పడుతుంది కదా.. అంటుంది.

Advertisement

మంచి చెడు చూడాలి కదా. ఏం జగతి నా ఏర్పాటు ఏవో నాకు ఉంటాయి కదా. టైమ్ పడుతుంది కదా. ఏమంటావు వసుధార అంటుంది దేవయాని. చాలా ఉంటాయి కదా అంటే.. అవన్నీ మీరు చూసుకోండి పెద్దమ్మ అంటాడు రిషి. వదిన వసుధారను లోపలికి తీసుకెళ్లండి అంటాడు.

నీ ఇష్టాన్ని, నీ మాటను నేను ఎప్పుడు కాదన్నా చెప్పు అంటుంది దేవయాని. అలాగే ఉండనివ్వు అంటుంది దేవయాని. తర్వాత ధరణి.. వసుధారను లోపలికి తీసుకెళ్తుంది. వసుధార.. వెల్ కమ్. నువ్వు ఈ ఇంట్లోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది ధరణి.

ఇన్నాళ్లు వసుధారగా మాత్రమే వచ్చావు. ఇప్పుడు రిషి చెప్పినట్టుగా అధికారంతో ఈ ఇంటికి కాబోయే కోడలుగా వచ్చావు అంటుంది ధరణి. దీంతో కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానాలు తెలియలేదు మేడమ్ అంటుంది వసుధార. దీంతో ఇంకా మేడమ్ ఏంటి.. అంటుంది ధరణి.

మరోవైపు జగతి.. రిషి, వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మురిసిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన దేవయాని.. జగతిపై సీరియస్ గా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి