
Devullu Movie fame Child Artist Nitya Shetty in Cash Promo
Devullu Movie Child Artist : సుమ క్యాష్ షో ఎంతగా వైరల్ అవుతుంటుందో అందరికీ తెలిసిందే. కొత్త కొత్త గెస్టులను పట్టుకొచ్చి వారితో ఆడుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఈ శనివారం ప్రసారం కాబోతోన్న ఎపిసోడ్‌లో నిహారిక, నిఖిల్, అనిల్, నిత్యా శెట్టి వచ్చారు. వీరంతా కలిసి వెబ్ సిరీస్ చేసినట్టున్నారు. ఈ నిత్యా శెట్టి ఎవరో కాదు.. దేవుళ్లు సినిమాలో ఉండే పిల్లలో ఒకరు. నీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ పాట పాడి అందరినీ ఏడిపించేశారు. ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. ఇన్నేళ్ల తరువాత ఇలా అందరి ముందుకు రావడం అంతా షాక్ అవుతున్నారు.
దేవుళ్లు సినిమాలో నటించింది ఈ అమ్మాయే అని చూపించారు. అంతే కాకుండా ఫేమస్ పాటను ప్లే చేసి చూపించారు. నీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ పాటను చూపించారు. ఇక ఇందులో నటించడం ఎలా ఉందంటూ నిత్యా శెట్టిని సుమ అడిగింది. ఆమె ఏ సమాధానం చెప్పకుండా తెగ నవ్వేసింది. కానీ ఇంతలో యూట్యూబర్ నిఖిల్ మాత్రం కౌంటర్ వేశాడు. ఇప్పుడు కిలోలకు కిలోల మేకప్ వేయాల్సి వస్తోందంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి ఈ ప్రోమోలో నిహారిక మాత్రం అదిరిపోయింది. నిహారిక నిహారిక అనే పాటను ప్లే చేసి మెగా డాటర్‌ను ఖుషీ చేశారు.
Devullu Movie fame Child Artist Nitya Shetty in Cash Promo
నిహారిక కోసం తన పేరు మీద పాట ఉండటంతో సుమ కూడా కౌంటర్ వేసింది. నా పేరు మీద కూడా ఓ పాట ఉంది తెలుసా? అంటూ సుమం, ప్రతి సుమం.. అనే పాటను పాడింది. మసులోళ్లకు అలాంటి పాటలే వేస్తుంటారు అని నిఖిల్ కౌంటర్ వేస్తాడు. అలా మొత్తానికి సుమ, నిహారిక, నిఖిల్ సందడితో ప్రోమో అదిరిపోయింది. ఈ ప్రోమోలోనే మై విలేజ్ షో ఫేమ్ అనిల్ నవ్వించేశాడు. గ్యాస్ ఉందంటూ వేసిన స్కిట్ బాగానే వర్కవుట్ అయింది. డాక్టర్‌గా నిహారిక నటించింది. సుమ రాజ్యం అంటూ వేసిన స్కిట్ కూడా బాగానే నవ్వులు పూయించింది. ఇందులో ఏడిపించే సీన్లు లేకపోవడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్‌లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
This website uses cookies.