Home » Entertainment » Dhanush Aishwarya Meet Again
Entertainment

Dhanush – Aishwarya : విడాకులు తీసుకున్న ధ‌నుష్- ఐశ్వ‌ర్య మ‌ళ్లీ క‌లిసిపోయారా..ఈ ఫోటో ఏం చెబుతుంది?

Authored By
Sam C
The Telugu News | Updated on: August 22, 2022 8:52 pm
Advertisement

Dhanush – Aishwarya : ఇటీవ‌లి కాలంలో మోస్ట్ పాపుల‌ర్ జంట‌లు విడాకుల బాట ప‌డుతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.. స్టార్ హీరోగా తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు విడాకులు ప్రకటించారు. ఈ విషయాన్ని వారిద్దరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు. ఈ నేఫధ్యంలో అసలు వీరెందుకు విడిపోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తమిళ మీడియా ప్రత్యేక కథనాలు వెలువరిస్తోంది. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు.

Advertisement

విడాకుల త‌ర్వాత నుండి ఎవ‌రి లైఫ్ వారిది అన్న‌ట్టు గ‌డుపుతున్నారు. అయితే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్‌- ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. ‘ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..’ అంటూ సోమవారం ఓ ఫొటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇందులో ధనుష్‌, ఐశ్వర్య… తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసి మ‌ళ్లీ ఇద్ద‌రు క‌లిసిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Dhanush Aishwarya meet again

Advertisement

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్స్ విడిపోయిన కూడా పిల్ల‌ల కోసం కొన్ని సంద‌ర్భాల‌లో క‌లుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ధనుష్‌- ఐశ్వ‌ర్య క‌లిసి క‌ట్టుగా క‌నిపించారు. ధనుష్ కస్తూరిరాజా కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కి విడుదలైన ‘కాదల్ కొండెన్’ అనే సినిమా కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ధనుష్, ఐశ్వర్య మధ్య పరిచయం ఏర్పడింది. నెమ్మదిగా ఆ పరిచయమే వీరి ప్రేమకు దారి తీసింది. దీంతో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే వరకు వెళ్లింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి