Dhee Dance Show interesting update
Dhee Dance Show : ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డ్యాన్స్ షో కార్యక్రమం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే వారం నుండి కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అభిమానులను మల్లెమాల వారు నిరాశ పర్చారు. ఈటీవీ మరియు మల్లెమాల వారు గతంలో సుధీర్ రష్మి గౌతమ్ మరియు శేఖర్ మాస్టర్ లతో ఫన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మంచి డాన్స్ తో పాటు వారు చేసిన ఫన్ తో మంచి రేటింగ్ నమోదు అయ్యింది. గత సీజన్ కు వారు లేరు. ఈసారి వారు ఉంటారా లేదా అనే అనుమానాలు నిన్న మొన్నటి వరకు ఉండేవి.
గత సీజన్ లో వీరు లేక పోవడంతో రేటింగ్ చాలా తక్కువగా నమోదు అయింది. అందుకే కొత్త సీజన్ కోసం వారిని కచ్చితంగా తీసుకొస్తారని.. సుధీర్ మరియు రష్మి గౌతమ్ ల జోడి మళ్లీ సందడి చేయడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొత్త సీజన్ ప్రారంభం కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది, అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. ఆ ప్రోమోలో ఎక్కడ సుధీర్ మరియు రష్మి గౌతమ్ కనిపించకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Dhee Dance Show interesting update
వారిద్దరు మాత్రమే కాకుండా శేఖర్ మాస్టర్ కూడా ఈ సీజన్ కి అందుబాటులో ఉండడం లేదని తేలి పోయింది. ఈ ముగ్గురి జోడి లేకపోతే కార్యక్రమాన్ని చూడాలనిపించడం లేదు అంటూ అభిమానులు చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. అయినా కూడా మల్లెమాల వారు మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు అన్నట్లుగా కొత్త వారిని తీసుకొచ్చింది. ఈ సీజన్ లో ప్రభుదేవా ఉంటాడా అన్నట్లుగా మొదటి ఎపిసోడ్ లో ఆయన సందడి చేశాడు. మరి పూర్తి సీజన్ లో ఉంటాడా లేదంటే గెస్ట్ గా వచ్చి వెళ్లిపోతాడా అనేది చూడాలి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.