Home » Entertainment » Did Prabahs Does Any Mistake
Entertainment

Prabhas : తప్పు ప్రభాస్ దే అంటున్నారు అందరూ .. చెయ్యకూడని అతిపెద్ద తప్పు చేశాడా ?

Authored By
Sam C
The Telugu News | Updated on: October 4, 2022 7:56 pm
Advertisement

Prabhas : బాహుబ‌లి సినిమాతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌భాస్ ఆ తర్వాత సాహో,రాధే శ్యామ్ చిత్రాలు చేశాడు. ఈ రెండు చిత్రాలు నిరాశ‌ప‌రిచాయి. ఇప్పుడు ఆదిపురుష్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ అయిన మంచి హిట్ అవుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఇది భారీ ఫ్లాఫ్ మూట‌క‌ట్టుకునేలా క‌నిపిస్తుంది. అందుకు కార‌ణం రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్. అనుకున్న స్థాయిలో లేనట్టుగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే.. మొత్తం యానిమేషన్ అన్నట్టుగానే సాగింది. ఒక రూంలోనే షూటింగ్ అంతా చేసేసి గ్రీన్ మ్యాట్‌తో సినిమాను చుట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక అసలే ఇప్పుడు తమిళ ప్రేక్షకులు మన మీద గుర్రుగా ఉన్నారు.

Advertisement

వారు అయితే ఈ సినిమాను కొచ్చాడియన్‌తో పోలుస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలతోనే గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులు చేయించాడు. అయితే ఇందులో రియాల్టీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏదేదో చేసేసి.. ప్రభాస్‌కు బాడీ తగిలించినట్టుగా.. గ్రాఫిక్స్‌లో అడ్జస్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది తప్పా.. ఒరిజినల్ కాదంటూ జనాలు అంటున్నారు. ఇదంతా కూడా చిన్నప్పుడు డిస్నీ చానెల్లో చూసినట్టుగా అనిపిస్తోందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా కోసం తాము పనిచేయలేదని స్పష్టం చేసింది. ‘‘వీఎఫ్‌ఎక్స్‌ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోన్న ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలా సంస్థ ‘ఆదిపురుష్‌’ వర్క్‌లో భాగం కాలేదు.

did prabahs does any mistake

Advertisement

Prabhas : ఏంద‌య్యా ప్ర‌భాసా..

ఈ సినిమాకు సంబంధించిన సీజీ లేదా ఏ ఇతర స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ను మేము చేయలేదు’’ అని పేర్కొంది. స‌రే ఎవరు త‌ప్పు చేసిన జ‌ర‌గ‌రాని న‌ష్టం జ‌రిగింది. అయితే ఇప్ప‌టికే రెండు ఫ్లాపులు చ‌విచూసిన ప్ర‌భాస్ కాస్త జాగ్ర‌త్త కూడా త‌సుకోక‌పోతే ఎలా చెప్పండి అంటూ కొంద‌రు చుర‌క‌లు అంటిస్తున్నారు. అయితే టీజ‌ర్ పై అంద‌రు దారుణ‌మైన కామెంట్స్ చేస్తుంటే ప్రభాస్ ఆది పురుష్ లుక్ పై ఒక రేంజిలో ఎలివేషన్స్ ఇస్తూ బండ్ల‌ కామెంట్లు చేశారు. కళ్ళల్లో రాజసం.. మీసంలో పౌరుషం.. అచ్చం శ్రీరామచంద్ర మహాప్రభు లాగా ఉన్న ప్రభాస్ అంటూ కామెంట్ చేశారు. బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటే వారంతా కామెంట్స్ రూపంలో బండ్ల గణేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి