Home » Entertainment » Dil Raju Wants To Marry Star Heroine
Entertainment

Dil Raju : భార్య చనిపోయిన తరవాత ఆ హీరోయిన్ తో పెళ్లి అనుకున్న దిల్ రాజు

Authored By
Sam C
The Telugu News | Updated on: November 12, 2022 3:09 pm
Advertisement

Dil Raju : టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌ల‌లో దిల్ రాజు ఒక‌రు. నైజాంలో మాత్ర‌మే కాదు ఇటు ఉత్త‌రాంధ్ర డిస్ట్రిబ్యూష‌న్లోనూ దిల్ రాజు కింగ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఇక నైజాంలో అయితే రాజుది ఏక‌చ‌క్రాధిప‌త్యం. రాజును ఢీ కొట్టే వాళ్లే లేరు. వ‌రంగ‌ల్ శ్రీను లాంటి వాళ్లు పోటీ ఇస్తార‌నుకుంటే లైగ‌ర్‌, ఆచార్య దెబ్బ‌తో పాతాళంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అంత‌టీ దిల్ రాజు హ‌వానే న‌డుస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి నిర్మాతగా ఆ రేంజ్ లో ఎదిగిన క్రెడిట్ కూడా దిల్ రాజుకే దక్కుతుంది.

Advertisement

దిల్ రాజు శ్రీవెంకటేశ్వర బ్యానర్ ద్వారా చిన్న హీరోలకు లైఫ్ ఇస్తూనే పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్ – తమిళ స్టార్ విజయ్‌లతో రెండు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈరెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. విజ‌య్ సినిమాని ఈ సంక్రాంతికి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాడు. ఇక దిల్ రాజు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న మొదటి భార్య అనిత అకాల మరణం తర్వాత.. తేజస్విని అనే ఆమెను దిల్ రాజు రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇటీవల పండంటి బాబు జన్మించాడు.

Dil Raju wants to marry star heroine

Advertisement

Dil Raju : జ‌స్ట్ మిస్..!

ఇటీవ‌ల దిల్ రాజు తన వారసుడిని.. ‘వారసుడు’ సినిమా హీరో విజ‌య్ తో పరిచయం చేసాడు.విజయ్ చేతుల్లో దిల్ రాజు వారసుడు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దిల్ రాజు రెండో వివాహానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ద‌క్కించుకున్నఓ భామ‌ని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నాడ‌ట‌. త‌ను అయితే త‌న వైవాహిక జీవితం బాగుంటుంద‌ని ఆమెని వివాహం చేసుకోవాల‌ని భావించ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న అది క్యాన్సిల్ అయింది. దీంతో కొంతకాలానికి దిల్ రాజు తేజశ్వినిని వివాహం చేసుకున్నాడు.ఇక ఆ తరవాత రూమర్లకు చెక్ పడింది..!!

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి