Home » Entertainment » Director Shankar Said No To His Daughter That Do Not Act With A Hero
Entertainment

Director Shankar : ఆ హీరోతో అస్సలు న‌టించ‌కు.. కూతురికి ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఎందుక‌లా చెప్పాడు?

Authored By
Sam C
The Telugu News | Published on: August 15, 2022, 9:20 pm
Advertisement

Director Shankar : ఇండియ‌న్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. భార‌తీయ సినిమాని ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లే సినిమాలు చేశాడు. ఆయ‌న ఒక‌ప్పుడు వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతుండ‌గా, ఇప్పుడు మాత్రం కాస్త స్లో అయ్యాడు. శంక‌ర్ ఇటీవ‌ల చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ప్ర‌స్తుతం మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా త‌ర్వాత భార‌తీయుడు 2 చిత్రంతో పాటు ప‌లు సినిమాలు చేయ‌నున్నాడు. అయితే శంక‌ర్ వారసురాలు అదితి..కార్తి విరుమాన్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఇటీవ‌ల సినిమా విడుద‌ల కాగా, అదితి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

Advertisement

Director Shankar : అదితికి సూచ‌న‌..

శంక‌ర్‌కి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్‌ విద్యను అభ్యసించారు. అందులో పెద్ద కూతురు అదితి శంకర్‌. ఈమెకు సినిమా హీరోయిన్‌ కావాలన్నది చిరకాల వాంఛ. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. తొలి చిత్రాన్ని పూర్తి చేసిన అదితి శంకర్‌ తర్వాత శింబు కథానాయకుడుగా నటించే కరోనా కుమార్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట. ఇది దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ చిత్రంలో నటించరాదని కూతురికి చెప్పినట్లు సమాచారం. అందుకు కారణం నటుడు శింబుపై ప్రేమ వివాదాలతో సంచలన నటుడిగా ముద్ర పడడమే అట.

Director Shankar said no to his daughter that do not act with A Hero

Advertisement

ఈ నేపథ్యంలో కరోనా కుమార్‌ చిత్రం అనేక సమస్యల కారణంగా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో దర్శకుడు శంకర్‌ టెన్షన్‌ పోయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. కాగా, అదితి వైద్య విద్యను అభ్యసిస్తూనే సంగీతాన్ని నేర్చుకున్నానన్నారు. అయితే నటనపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందన్నారు. ఆ కల విరుమాన్‌ చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను తేన్‌మొళిగా మధురై యువతి పాత్రలో నటించానన్నారు. తనకు అంకెల స్థానంపై నమ్మకం లేదని శ్రమను, అంకిత భావాన్ని నమ్ముకుని పని చేస్తానని అదితి శంకర్‌ పేర్కొన్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి