Home » Entertainment » Director Trivikram As Hero Script Is Ready
Entertainment

Trivikram : హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ..?

Authored By
Breaking News
The Telugu News | Published on: November 3, 2022, 12:25 pm
Advertisement

Trivikram : టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా విజయవంతంగా రాణించిన వాళ్ళు హీరోలైన వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి, దాసరి నారాయణరావు ఇంకా పలువురు. ఇప్పుడు ఇదే కోవలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేరనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. దర్శకుడిగా మరియు రచయితగా త్రివిక్రమ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోలతో పనిచేయడం జరిగింది. అయితే నవంబర్ 7వ తారీకు త్రివిక్రమ్ పుట్టినరోజు నేపథ్యంలో… ఆయన హీరోగా ఒక స్క్రిప్ట్ రెడీ అయినట్లు .. ఈ సినిమాకి సంబంధించి ప్రకటన రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

 

Advertisement

పూర్తి విషయంలో వెళ్తే త్రివిక్రమ్ కెరియర్ లో స్రవంతి మూవీస్ బ్యానర్ ప్రధాన పాత్ర పోషించింది. “నువ్వే కావాలి” వంటి సినిమాకు మాటలు అందించిన త్రివిక్రమ్ నీ “నువ్వే నువ్వే” సినిమాతో దర్శకుడిగా పరిచయం చేయటం జరిగింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ నీ హీరోగా చూపించడానికి ఓ వైవిధ్యమైన స్టోరీని స్రవంతి మూవీస్ బ్యానర్ లాక్ చేసినట్లు… సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నవంబర్ 7వ తారీకు త్రివిక్రమ్ పుట్టినరోజు నేపథ్యంలో..”నువ్వే నువ్వే” సినిమా స్పెషల్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేయటానికి స్రవంతి మూవీస్ బ్యానర్ రెడీ అయింది.

Advertisement

ఇదే సందర్భంలో త్రివిక్రమ్ హీరోగా స్క్రిప్ట్ కి సంబంధించిన ప్రాజెక్టు ప్రకటన త్రివిక్రమ్ పుట్టినరోజు నాడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా అయినా వెంటనే హీరోగా త్రివిక్రమ్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి