Vimal Krishna : కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధిస్తుంటాయి. అలాంటి వాటిలో డీజే టిల్లు మూవీ ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ ,నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ చేస్తున్నారు. నూతన దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్ చేస్తున్న సమయంలో దర్శకుడు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ”డీజే టిల్లు” సినిమా భారీ విజయాన్ని నమోదు చేసి ‘అట్లుందటి మనతోని’ అంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా రేంజ్ లో సంచలనం సృష్టించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఓటీటీలోనూ సత్తా చాటింది. దీంతో మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేశారు. ‘డీజే టిల్లు’ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అందించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత ప్రొడక్షన్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ని కూడా ఇందులో భాగం చేశారు. ఇప్పుడు ‘డీజే టిల్లు 2’ సినిమాని కూడా అదే బ్యానర్లలో నిర్మించడానికి రెడీ అయ్యారు. సీక్వెల్ కోసం దర్శకుడు విమల్ కృష్ణతో మరోసారి చేతులు కలిపాడు సిద్ధు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసారని అనుకుంటుండగా.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ గాసిప్ బయటకు వచ్చింది.
‘డీజే టిల్లు’ డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ సీక్వెల్ ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య పలు క్రియేటివ్ డిఫరెన్సెస్ చోటు చేసుకున్నాయని వినికిడి. సిద్ధు ప్రవర్తనతో హర్ట్ అయిన విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఈ సీక్వెల్‌కు అన్ని తానై చూసుకుంటున్నాడట సిద్ధు. విమల్ ప్లేస్‌లో కొత్త దర్శకుడు సైతం వచ్చనట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్, కొత్త డైరెక్టర్ వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. కాగా అటు విమల్ కృష్ణ.. నాగ చైతన్యకు ఒక కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇకపోతే సిద్ధు – నేహా శెట్టిలతో పాటుగా ప్రిన్స్ – బ్రహ్మజీ తదితరులు ఈ సీక్వెల్ లో ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ‘డీజే టిల్లు’ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ఎస్ థమన్ ఈ ప్రాజెక్ట్ లోనూ భాగం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్న డీజే టిల్లు రెండో భాగంలో హీరోయిన్ మారబోతోందని తెలుస్తోంది.
మొదటి భాగంలో అద్భుతంగా నటించిన నేహా శెట్టిని ఈ సినిమాలో అతిథి పాత్రలో చూపించనున్నారట. మొదటి భాగంలో నటించిన కొన్ని పాత్రలు రెండో భాగంలోనూ కొనసాగుతాయి. ఇంకొన్ని అడిషనల్ రోల్స్ కూడా యాడ్ చేయబోతున్నారట. సో.. చూడాలి మరి ఆ అదృష్టం ఏ హీరోయిన్‌ని వరిస్తుందనేది!. లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో నటించి మెప్పించాడు సిద్ధు జొన్నల గడ్డ. ఈ యంగ్ హీరోకు ‘డీజే టిల్లు’ సినిమాతో సుమారు 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నాడు. సీక్వెల్ కోసం సిద్ధూ జొన్నలగడ్డ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకోబోతున్నట్టు తెలుస్తుండగా, ఈ సినిమాలో ఓ ముఖ్యమైన మార్పు తీసుకొస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి మరి రానున్న రోజులలో ఈ సినిమాకి సంబంధించి ఇంకెలాంటి ప్రచారలు బయటకు వస్తాయో..!
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.