Allu Arjun : అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కు ముందు విజేత, డాడీ సినిమాల్లో కూడా అల్లు అర్జున్ కనిపించాడు. హీరోగా అధికారికంగా గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే మొదటి సినిమాలో నిక్కర్ వేసుకుని చిన్న పిల్లగాడిగా కనిపించడంతో హీరోగా అల్లు అర్జున్ కి రెండవ సినిమా ఆర్య మంచి కమర్షియల్ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆర్య సినిమా తర్వాత బన్నీ సినిమాను అల్లు అర్జున్ చేశాడు. ఆ సినిమా కూడా బన్నీ కోటి లోపు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
బన్నీ తర్వాత హ్యాపీ సినిమాను అల్లు అర్జున్ చేశాడు. బన్నీ సినిమా వరకు కూడా కోటి రూపాయల లోపు పారితోషికం తీసుకున్న అల్లు అర్జున్ హ్యాపీ సినిమాకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని అంతా అనుకుంటారు. కానీ హ్యాపీ సినిమా ను అల్లు అరవింద్ నిర్మించడంతో బన్నీకి రెమ్యూనరేషన్ గా ఇచ్చింది చాలా తక్కువే. కనుక అల్లు అర్జున్ అధికారికంగా కోటి రూపాయలకు మించి పారితోషికం తీసుకున్న మొదటి సినిమా దేశముదురు. 2007 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన దేశ ముదురు సినిమాకు గాను అల్లు అర్జున్ కోటి రూపాయలకు మించి రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. మొదటిసారి అల్లు అర్జున్ దేశముదురు సినిమా తో కోటి రూపాయలు తీసుకున్న హీరోగా నిలిచాడు.
ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ వెంటనే వచ్చిన పరుగు సినిమాకు ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడని సమాచారం అందుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ యొక్క రెమ్యూనరేషన్ పుష్ప 2 కి 100 కోట్లకు మించి రాబోతుంది అనే విషయం తెలిసిందే. 2007 సంవత్సరంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ 2023 వరకు ఏకంగా 100 కోట్ల రమ్యునరేషన్ స్థాయికి దిగాడు అంటూ ఆయన స్టార్ డం ఎక్కడి నుండి ఎక్కడికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అయినప్పటికీ సొంతంగానే ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ ముందు ముందు మరింత భారీ విజయాలను సొంతం చేసుకుని సినిమాలను చేయడంతో పాటు పాన్ ఇండియా స్టార్ గా నిలవాలని కోరుకుందాం.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.