Home » Entertainment » Do You Know Why Manchu Lakshmi Divorced Her First Husband
Entertainment

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీ ప్రాణంగా ప్రేమించిన భ‌ర్త‌కి ఎందుకు విడాకులు ఇచ్చిందో తెలుసా?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 8, 2024, 8:00 pm
Advertisement

Manchu Lakshmi : మంచు మోహ‌న్ బాబు ముద్దుల కూతురు మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మొద‌ట్లో న‌టిగా త‌న టాలెంట్ నిరూపించుకున్న ఈ భామ ఇప్పుడు మాత్రం అంత‌గా రాణించ‌లేక‌పోతుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు ల‌క్ష్మీ ఒక్కోసారి త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలని కూడా షేర్ చేసుకుంటుంది. అయితే మంచు లక్ష్మి తన మొదటి భర్తకు విడాకులిచ్చిందనే విషయం కొందరికి మాత్ర‌మే తెలుసు. చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి మరీ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని అతడికి భార్యగా మారిపోయింది. అయితే తన ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో మంచు లక్ష్మికి కోపం వచ్చే బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందని సమాచారం .

Advertisement

Manchu Lakshmi : తండ్రి బాధ‌ల వ‌ల్ల‌నే…

ముఖ్యంగా మోహన్ బాబు ఊర్లో లేని సమయంలో ఎవరికి చెప్పకుండా ఆర్య సమాజంలో తాను ప్రేమించిన శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మంచు లక్ష్మి ఎందుకు విడాకులు ఇచ్చిందో అనే దానిపై క్లారిటీ లేదు. మోహన్ బాబు చేసిన ఒత్తిడి కారణంగానే ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారనే రూమర్ అయితే నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. మంచు లక్ష్మి ప్రేమకు తండ్రే విలన్‌గా మారాడని అంటుంటారు. మొదటి భర్తతో విడాకులు తర్వాత లండన్‌కు వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కూడా ఓ వ్యక్తిని ప్రేమించారనే వార్తలొచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీ ప్రాణంగా ప్రేమించిన భ‌ర్త‌కి ఎందుకు విడాకులు ఇచ్చిందో తెలుసా?

Advertisement

యాదృచ్ఛికమేమిటంటే మంచు లక్ష్మి రెండవసారి వివాహం చేసుకున్న వ్యక్తి పేరు కూడా శ్రీనివాస్ కావడం గమనార్హం. ఇక వీరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. స‌రోగ‌సి ద్వారా ఆ చిన్నారికి జ‌న్మ‌నిచ్చింది మంచు ల‌క్ష్మీ. ఇప్పుడు ఆ చిన్నారికి సంబంధించిన ప‌లు ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది ఇటీవ‌ల మంచు ల‌క్ష్మీ త‌న సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫ‌టోలు షేర్ చేస్తూ ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి