
doctors press meet about Superstar Krishna death
Superstar Krishna : ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో మరొక విషాదం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తల్లి అయిన ఇందిరా దేవి గారు పోయిన నెల సెప్టెంబర్ 28న తుది శ్వాస విడిచారు. ఆ సంఘటనతో సూపర్ స్టార్ ఫ్యామిలీ చాలా బాధకు గురైంది. ఇక ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరల సూపర్ స్టార్ ఫ్యామిలీకి ఎదురు దెబ్బ తగిలింది. ఇంటికి పెద్ద దిక్కు అయినా సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం 4.09 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. కృష్ణగారి ఫ్యామిలీలో వరస మరణాలతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే కృష్ణ గారు ఎలా చనిపోయారు..? అసలేం జరిగింది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.
దిగ్గజ నటుడు కృష్ణ గారు గుండెపోటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వలన చనిపోయినట్లుగా డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంటినెంటల్ ఆసుపత్రి చైర్మన్ గురు ఏన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కృష్ణ గారు గుండెపోటు సమస్యతో ఆసుపత్రికి వచ్చినట్లుగా తెలియజేశారు. వచ్చిన వెంటనే ఆయనను ఎమర్జెన్సీ వార్డ్ కు తరలించి సిపిఆర్ చేశామని, ఆ తర్వాత నుండి చికిత్స చేయడం ప్రారంభించామని తెలియజేశారు. ఆస్పత్రికి వచ్చినప్పటి నుండే కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రెండు మూడు గంటల తర్వాత కొన్ని అవయవాలు అసలు పని చేయడం మానేశాయని తెలియజేశారు. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం రావడంతో అది కూడా చేశామని, ఇక కృష్ణ గారికి అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశామని
doctors press meet about Superstar Krishna death
, చెప్పుకొచ్చారు. ఇక సోమవారం సాయంత్రం కృష్ణగారి ఆరోగ్యం మరింత విశమించిందని, ఇక ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్య బృందం నిర్ధారించారట. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసి ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొద్ది గంటలు మనశ్శాంతిగా ఉండేలా చూసుకున్నామని తెలియజేశారు. ఇక మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ గారు తుది శ్వాస విడిచారని వైద్య బృందం స్పష్టం చేసింది. ఆ తర్వాత కృష్ణ గారి భౌతికకాయాన్ని వాళ్ళ కుటుంబానికి అప్పగించామని, మిగిలిన విషయాలు వారి కుటుంబ సభ్యులు వెల్లడిస్తారని డాక్టర్ గురు ఏన్ రెడ్డి తెలియజేశారు. ఇక కృష్ణగారి మరణంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. మరో సీనియర్ నటుడు దూరం అవడంతో అందరూ బాధపడుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.