Bigg Boss 8 Telugu : ఇంట్రెస్టింగ్‌గా మారిన ఎలిమినేషన్.. కమ్యూనిటీ చర్చనే కొంప ముంచిందా..!
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. ఎవరు ఎంట్రీ ఇస్తారో, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అభిమానులలో ఆసక్తిని పెంచింది. అయితే ప్రతి శనివారం వచ్చిందంటే నాగార్జున కంటెస్టెంట్స్‌కి క్లాసులు పీకుతుండడం మనం చూస్తూ ఉన్నాం. తాజా ఎపిసోడ్‌లో బ్రేకప్ లవ్ స్టోరీలతో పాటు.. ట్రాయాంగిల్ లవ్ స్టోరీలను కూడా బయటపెట్టాడు. విష్ణు ప్రియను ఓ పాయింట్ లో నామినేట్ చేసిన యష్మిని.. మరి నువ్వు చేస్తుంది ఏంటీ అని డైరెక్ట్ గా క్వశ్చన్ వేశాడు నాగ్. ఇక నిఖిల్, పృధ్వీల ఆటను అద్భుతం అన్న నాగార్జున…ఆటను అద్భుతం అంటూనే వారు చేసిన తప్పులను ఎత్తి చూపించాడు కింగ్. అంతే కాదు గంగవ్వ చేసిన ఫ్రాంక్ వీడియోను కూడా ప్రత్యేకంగా అభినందించాడు నాగార్జున.
ఇక బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్‌లో మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని ఉన్నారు. వీరిలో నామినేషన్స్ పూర్తయినప్పటి నుంచి బిగ్ బాస్ ఓటింగ్‌లో ప్రేరణ టాప్‌లో ఉంటూ కొనసాగింది. అత్యధిక ఓట్లతో ప్రేరణ నెంబర్ వన్ స్థానంలో ఉంటే నిఖిల్ రెండో స్థానం, విష్ణుప్రియ మూడో ప్లేసులో నిలిచింది.ఇక నాలుగో స్థానంలో పృథ్వీ ఉంటే.. ఐదు, ఆరు స్థానాల్లో మెహబూబ్, నయని ఉన్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న మెహబూబ్, నయని స్థానాలు మారుతూ వచ్చాయి. ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడని కొన్ని వర్గాలు అంటే.. మరికొంతమంది నయని పావని ఎలిమినేట్ అయిందని టాక్ నడిచింది.
Bigg Boss 8 Telugu : ఇంట్రెస్టింగ్‌గా మారిన ఎలిమినేషన్.. కమ్యూనిటీ చర్చనే కొంప ముంచిందా..!
అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ హౌజ్‌లోకి వచ్చిన రెండు రోజులకు నబీల్‌తో కమ్యూనిటీపై చర్చ పెట్టాడు. తమ కమ్యూనిటీ వాళ్లంతా వారిద్దరికే ఓట్లు వేస్తారు అని, ఇద్దరిలో ఏ ఒక్కరు నామినేషన్స్‌లో ఉన్న ఓట్లు గుద్దుతారని, ఇద్దరు నామినేట్ కాకుండా చూసుకోవాలని మెహబూబ్ చెప్పాడు. మెహబూబ్, నబీల్ మాట్లాడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాంతో మెహబూబ్‌పై తీవ్రమైన నెగెటివిటీ ఎర్పడింది. అందుకే ఆ తర్వాతి వారమే నామినేషన్స్‌లోకి వచ్చిన మెహబూబ్‌కు ఓట్లు పడలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడని టాక్ నడుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.