Ester Noronha : హీరోయిన్ అవ్వాలంటే పడుకోవాల్సిందే.. లేదంటే ఇలా చేయ్యమంటారు.. నేను కూడా.. ఎస్తర్ వీడియో వైరల్
Ester Noronha : టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ తెలుసు కదా. ఆమె తేజ ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్. ఎస్తర్ వెయ్యి అబద్ధాలు అనే సినిమాలో తొలిసారి నటించింది. ఆ సినిమాకు డైరెక్టర్ తేజ. ఆ సినిమా తర్వాత తనకు చాలానే అవకాశాలు వచ్చినా అవి అంతగా ఆడలేదు. తనను తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. అయినా తనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం కొన్ని ఆ సీన్ల కోసం మాత్రమే తనను సినిమాల్లో తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
ester noronha stunning comments on heroines
సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్తర్.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎస్తర్, నోయర్ ఇద్దరూ విడిపోయారు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తను మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. హీటెక్కించే పాత్రల్లో నటిస్తూ బిజీగా మారిన ఎస్తర్ తాజాగా ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడైతే ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ.. ఆడవాళ్లకు ఏ ఇండస్ట్రీలో అయినా ఇబ్బందులు తప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఎస్తర్.
Ester Noronha About Film Industry Casting Couch
Ester Noronha : ఏ ఇండస్ట్రీలో అయినా ఆడవాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి
అవకాశాల కోసం చెప్పింది చేసేవాళ్లు ఉన్నారు. అలా కాకుండా వద్దు అనుకున్నవాళ్లూ ఉన్నారు. వాళ్లలో నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లు ఉన్నారు. కానీ.. నేను అవకాశాల కోసం మరీ అంత దిగజారలేను. అందుకే ఒక సినిమా పోయినా పర్వాలేదు అని అనుకుంటాను అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి.. ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే.. తప్పకుండా పడుకోవాల్సిందే అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. మన హద్దుల్లో మనం ఉంటే ఎవరూ ఏం చేయలేరు కదా అని కూడా తెలిపింది ఎస్తర్.
