Home » Entertainment » Etv And Mallemala Not Using Sudigali Sudheer And Rashmi Gautamlove Track
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ లవ్‌ ను వాడటం మానేసిన ఈటీవీ.. కారణం ఇదే

Authored By
Himanshi
The Telugu News | Published on: February 7, 2022, 5:30 pm
Advertisement

Sudigali Sudheer : ఈటీవీ జబర్దస్త్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సుధీర్ రష్మీ ల ప్రేమ వ్యవహారం. వీరిద్దరి ప్రేమ వ్యవహారం దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా బుల్లి తెరపై కొనసాగుతోంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ ఈ టీవీ మరియు మల్లెమాల వారు మాత్రం వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారాన్ని వినియోగించుకుంటూ తమ షోల వ్యూవర్‌ షిప్ ను మరియు రేటింగ్‌ లను పెంచుకునేందుకు ప్రయత్నం చేశారు.. చేస్తూనే ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని జనాలు గుర్తించి మల్లెమాల వారికి షాక్ ఇస్తూ వీరిద్దరి కార్యక్రమాలను కూడా చూడటం లేదు.

Advertisement

రష్మీ పెళ్లి అయ్యింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ ఆమె కచ్చితంగా సుధీర్ ని ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే చూస్తుంది అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రేక్షకులు కూడా వీరిద్దరినీ ప్రేమికులు అని అనుకోవడం మానేశారు. ఇన్ని రోజులు ఈ టీవీ వారు కేవలం రేటింగ్ కోసం తమను మోసం చేశారని ప్రేక్షకులు మెల్ల మెల్లగా తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి విషయాలను తెలుసుకుని నెటిజన్స్ ఇప్పటికే వారిద్దరి రొమాన్స్ ను ఫేక్ అని నిర్ధారించుకున్నారు. ఇక సాధారణ ప్రేక్షకులు కూడా ఇద్దరి ప్రేమ వ్యవహారం కేవలం డ్రామా అని రేటింగ్ కోసం సృష్టించిన ప్రేమ అని అర్థం చేసుకున్నారు.ఆ కారణాల వల్లే సుధీర్ రష్మీ లను ఇకపై జోడిగా తీసుకు రాకుండా ఉండాలని ఈ టీవీ మరియు మల్లెమాల వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

etv and mallemala not using Sudigali Sudheer and Rashmi Gautam love track

Advertisement

Sudigali Sudheer  : రష్మీ, సుధీర్‌ల లవ్‌ డ్రామా ను ఎవరు మ్యాచ్‌ చేయలేరు

ఒకవేళ తీసుకు వచ్చిన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అని ఈటీవీ అనుకుంటుందట. అందుకే ఈ మధ్య కాలం లో సుధీర్ రష్మీ ల ని ఎక్కువగా కలిపి కార్యక్రమాలు చేయడం లేదు. అంతే కాకుండా జబర్దస్త్ లో కూడా ఇద్దరిని హైలెట్ చేయడం చేయట్లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే ముందు ముందు మరింతగా వీరిద్దరిని విడదీసి చూపించే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఈ సమయంలోనే ఈ టీవీ మల్లెమాల వారు కొత్త జంటల కోసం చూస్తున్నారు. ఎవరు కనిపిస్తే వారికి లవ్ సింబల్ ఏసి ప్రేమలో ఉన్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎమాన్యూల్‌, వర్ష మరియు ఫైమా, ప్రవీణ్‌ ఇంకా కొంత మంది జంటలపై కూడా లవ్‌ సింబల్స్ వేస్తున్నారు. ఎంతైనా రష్మీ సుధీర్ స్థాయిలో ఏ ఒక్కరికి లవ్ డ్రామాకు గుర్తింపు రావడం లేదు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి