Home » Entertainment » Etv Mallemala Dhee Dance Show 15th Season Rating Not Happy
Entertainment

Dhee Dance Show : ఢీ 14 తో పోల్చితే ఢీ 15 మరీ దారుణం భయ్యా.. ఇలా అయితే ఢీ 16 ఉండేనా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 9, 2023 6:02 pm
Advertisement

Dhee Dance Show : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా మల్లెమాల వారు నిర్వహిస్తున్న షో లు మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతూ ఆ తర్వాత పూర్తిగా మూత పడుతున్నాయి. క్యాష్ క్యారక్రమంను జనాలు ఆధరించడం లేదు అంటూ క్లోజ్ చేయడం జరిగింది. ఆ ప్లేస్ లో మరో షో వస్తుంది అది వేరే విషయం అనుకోండి. ఇంకా మల్లెమాల వారు నిర్వహిస్తున్న ఢీ డాన్స్‌ షో ఇప్పటి వరకు 14 సీజన్ లను పూర్తి చేసుకుని ప్రస్తుతం 15వ సీజన్ నడుస్తున్న విషయం తెల్సిందే. వారంకు ఒక రోజు టెలికాస్ట్‌ అవుతున్న ఈ షో యొక్క రేటింగ్ దారుణంగా

Advertisement

పడిపోయిందని స్వయంగా షో లో ఉన్న వారు అంటున్నారు.సుధీర్‌.. ప్రదీప్.. రష్మీ గౌతమ్‌.. ఆది ఇంకా ఇతరులు ఉన్న సమయంలో ఢీ యొక్క రేటింగ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. గతంతో పోల్చితే ఢీ డాన్స్ షో యొక్క రేటింగ్‌ నిరాశ కలిగిస్తుంది. ఢీ 14 సీజన్‌ యొక్క రేటింగ్‌ దారుణంగా నమోదు అయ్యిందని.. అందుకే 15 వ సీజన్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకు ఉంటారని అంతా భావించారు. కానీ కొత్త సీజన్ కూడా ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తూనే ఉంది. ఆది ఏదో కామెడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ వర్కౌట్‌ అవ్వడం లేదు.

etv mallemala Dhee Dance Show 15th season rating not happy

Advertisement

ఇక రష్మీ గౌతమ్మ రియు సుధీర్ లను కొత్త సీజన్ కు తీసుకు వస్తారని అంతా భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో రేటింగ్‌ గత సీజన్ తో పోల్చితే మరింత తగ్గింది. గతంలో డాన్స్ తో పాటు మంచి కామెడీ తో ఢీ షో సాగింది. ఇప్పుడు డాన్స్ లేదు అలాగే కామెడీ లేదు అంటూ ఉన్నారు. ఆది ఉన్నప్పటికి ఆయన కామెడీ టైమింగ్ కు సరిపడే వారు లేరు. జెస్సీ పై ఆది పంచ్ లు వేయడం వాటికి జెస్సీ నోరు వెళ్లబెట్టడం చూస్తూ ఉంటే ఈ సీజన్ తర్వాత కొత్త సీజన్ ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి