Home » Entertainment » Etv Sridevi Drama Company Rating Vs Star Maa Tv Party Cheddam Pushpa
Entertainment

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీకి ఊరట.. పార్టీ చేద్దాం పుష్ప రెగ్యులర్‌ కాదట!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 4, 2022 2:12 pm
Advertisement

Sridevi Drama Company : ఈటీవీలో టెలికాస్ట్‌ అవుతున్న జబర్దస్త్‌ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీల యొక్క రేటింగ్ దారుణంగా పడిపోతుంది. ఈ సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీకి పోటీ అన్నట్లుగా స్టార్‌ మా టీవీలో పార్టీ చేద్దాం పుష్ప అంటూ రాబోతుంది. వారం వారం రాబోతున్న ఆ ఎపిసోడ్స్ ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి పెద్ద డ్యామేజీని చేయడం ఖాయం అంటున్నారు. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పార్టీ చేద్దాం పుష్ప ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన ప్రోమో తో క్లారిటీ ఇవ్వకనే ఇచ్చేశారు.

Advertisement

పార్టీ చేద్దాం పుష్ప కనుక సూపర్‌ హిట్ అయితే ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ పూర్తిగా డౌన్ అయ్యి.. కేవలం యూట్యూబ్‌ వ్యూస్ మీదే ఆధారపడాల్సి ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పార్టీ చేద్దాం పుష్ప నుండి పెద్ద ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పార్టీ చేద్దాం పుష్ప కేవలం సింగిల్‌ ఎపిసోడ్‌ అంటూ క్లారిటీ ఇవ్వడంతో పాటు వచ్చే వారం మరేదైనా స్పెషల్‌ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.

etv Sridevi Drama Company rating vs star maa tv party cheddam pushpa

Advertisement

వారం వారం వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షో మాదిరిగా పార్టీ చేద్దం పుష్ప రాబోవడం లేదని స్టార్ మా స్వయంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్‌ షో గా కాకుండా అప్పుడప్పుడు ప్రత్యేక కార్యక్రమంగా పార్టీ చేద్దాం పుష్ప ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం అంటూ స్టార్‌ మా వర్గాల వారు అధికారికంగా ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు బుల్లి తెర వర్గాల వారు కూడా ఆదివారం రెండు షో లు టెలికాస్ట్‌ అవుతాయి కనుక ఏ షో కు ఎక్కువ రేటింగ్‌ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. పార్టీ చేద్దాం పుష్ప కు కనుక మంచి రేటింగ్‌ వస్తే ఖచ్చితంగా ముందు ముందు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి