
Bigg Boss Faima elimination fans angry on Bigg Boss team and star maa tv
Bigg Boss Faima : బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు నుండి మొన్న ఆదివారం ఫైమా ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఫైమా ఎలిమినేషన్ ను చాలా మంది తప్పుబడుతున్నారు. ఆమెకు ప్రేక్షకుల మద్దతు ఉన్నా కూడా షో నిర్వాహకులు కావాలని ఎలిమినేట్ చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫైమా కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కచ్చితంగా టాప్ 5 వరకు ఉండాల్సిన కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా ఆమె ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అనేది పెద్ద ప్రశ్న.
సరే ఫైమా వీక్ అవ్వడం వల్ల ఎలిమినేట్ అయ్యిందే అనుకుందాం.. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో సగానికి పైగా ఫైమా కంటే వీక్ ఉన్న వారే ఉన్నారు. టాస్క్ ల్లో పెద్దగా ప్రభావం చూపించలేని వారు మరియు ఇమేజ్ పరంగా కూడా ఫైమా కంటే వెనుక ఉన్న వారు చాలా మందే ఉన్నారు. అయినా కూడా వారు లోపల ఉన్నారు.. ఫైమా బయట ఉంది అంటూ ఆమె అభిమానులు బిగ్ బాస్ టీమ్ పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఫైమా గత వారంలోనే తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అవ్వాల్సింది సేవ్ అయ్యింది అంటూ బిగ్ బాస్ వారు పేర్కొన్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కిన కారణంగానే ఫైమా సేవ్ అయ్యింది.
Bigg Boss Faima elimination fans angry on Bigg Boss team and star maa tv
కనుక ఈ వారం ఆమెను ఎలిమినేట్ చేయాల్సిందే అంటూ నిర్వాహకులు భావించారా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టాప్ 5 కి కచ్చితంగా అర్హత ఉన్న కంటెస్టెంట్ ఫైమా. అయినా కూడా ఆమెకు ఛాన్స్ దక్కలేదు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుని చిన్న వయసులోనే ఎక్కువ క్రేజ్ ను దక్కించుకున్న ఫైమా కు బిగ్ బాస్ వారు అన్యాయం చేశారు అనేది ఆమె అభిమానుల మాట. ఫైమా కూడా తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తెలియడం లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.