Mahesh Babu : సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాలనుకున్న మూవీ మరొకరిని వరిస్తుంది.. అయితే అది హిట్ అవ్వడం లేక ఫ్లాప్ అవ్వడం అనేది తర్వాత విషయం. ఇలా చాలా మంది హీరోల విషయంలో జరిగింది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు 2021 కొన్ని చాన్సులను వదులుకున్నాడని హర్ట్ అవుతున్నారు ఆయనకు సంబంధించిన కొందరు ఫ్యాన్స్. అయితే వాటిని వదులు కోవడంపై కొన్ని మంది ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో 1 నేనొక్కడినే మూవీ వచ్చింది. అదే కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతున్నట్టు వీరిద్దరూ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు.
కాని కొన్ని రోజులకే ఎందుకో తెలియదు కానీ సుకుమార్ తో మూవీ చేయట్లేదని మహేశ్ బాబు ప్రకటించాడు. అదే టైంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప మూవీని అనౌన్స్ చేశాడు సుకుమార్.. అయితే మహేశ్ వద్దనుకున్న మూవీని స్టైలిష్ స్టార్ చేస్తున్నాడని అనుకున్నారు వీరిద్దరి ఫ్యాన్స్. పుష్ప మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియాలో హంగామా చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో అలా వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరూ మూవీస్ ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. ఇదే టైంలో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు పడిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే పుష్ప మూవీని రిజక్ట్ చేసి మహేశ్ బాబు మంచిపని చేశారంటున్నారు ఆయన ఫ్యాన్స్. పుష్పలో అల్లు అర్జున్ గెటప్ చూసిన మహేశ్ ఫ్యాన్స్.. తమ హీరోను అలాంటి గెటప్‌లో ఊహించుకోలేమంటున్నారు. అయితే ఆ క్యారెక్టర్ సూట్ కాకపోవడంతోనే మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఆచార్య మూవీలోనూ రామ్ చరణ్ కు సంబంధించిన క్యారెక్టర్ చేయడానికి మహేశ్ ఒప్పుకోలేదట. అయితే గతంలో కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని మహేశ్‌కు సంబంధించిన కొన్ని మూవీస్ ఫ్లాప్ కావడంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మహేశ్ అనుకుంటున్నట్టు టాక్. అందుకే తనకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉన్న మూవీస్ మాత్రమే ఆయన ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
This website uses cookies.