Nagarjuna : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ బాస్ కార్యక్రమం రోజురోజుకి వివాదాల బాట పడుతుంది. ఈ సీజన్ లో సరైన కంటెస్టెంట్స్ ఎంపిక చేయలేదని, ఎలిమినేషన్ కూడా దారుణంగా జరుగుతుందని, టాస్క్‌లు ఏదో తూతూ మంత్రంగా సాగుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున సైతం ఈ సారి హోస్టింగ్ విషయంలో విమర్శల బారిన పడుతున్నాడు. బిగ్ బాస్ రెండవ సీజన్ నుండి ఓటీటీ వెర్షన్ తో కలిపి 5 సీజన్స్ కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తుండగా, మొదట్లో ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కాని రాను రాను తగ్గుతూ పోతుంది.
బిగ్ బాస్ షో అంటేనే అసలు ఇష్టం లేదని చెప్పిన నాగార్జున ఇన్ని సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యాపరుస్తుంది. అయితే నాగార్జున బిగ్ బాస్ జర్నీ ఈ సీజన్ తో ముగియబోతుందని , దానికి కారణం పారితోషికం విషయం లో అక్కినేని నాగార్జున కి బిగ్ బాస్ యాజమాన్యం కి ఇటీవల ఏర్పడిన విభేదాలేనని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఈ షో కోసం నాగార్జున 3 నుండి 5 కోట్ల రూపాయిల వరుకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు… సీజన్ 6 కి అగ్రిమెంట్ ప్రకారం 6 కోట్ల రూపాయిల వరుకు ఇస్తామని డీల్ సెట్ చేశారట. అయితే సీజన్ రేటింగ్ సరిగ్గా లేకపోవడంతో నిర్వాహకులకి నష్టం వాటిల్లిందని,
ఆ నష్టాన్ని పూడ్చేందుకు కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్స్ దగ్గర నుండి..క్యాష్ ప్రైజ్ వరుకు అన్నిట్లో కోతలు విధిస్తుండగా , నాగార్జున రెమ్యూనరేషన్ కి కూడా ఇప్పుడు మూడు కోట్ల రూపాయిల వరుకు కోత విధించినట్టు సమాచారం. మరోవైపు నాగార్జున పక్షపాతం చూపిస్తున్నాడని, కొందరివైపే గేమ్ ఆడుతున్నాడని పలువురు నాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఇలా చేస్తే నిన్ను ఎలిమినేట్ చేసి తీరుతామంటూ కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాజ్ ఎలిమినేషన్ అస్సలు సరిగా లేదని నాగ్ కూడా దీనిపై ఏం మాట్లాడకపోవడం బాధగా ఉందని కొందరు చెప్పుకొస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.