Home » Entertainment » Film Comedians In Jabardasth Comedy Show
Entertainment

Jabardasth : జబర్దస్త్‌ నుండి సినిమాల్లోకి అప్పుడు.. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 15, 2022, 12:30 pm
Advertisement

Jabardasth : జబర్దస్త్ ప్రారంభమైన సమయంలో చాలా తక్కువ మంది కమెడియన్స్ మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది షో కి రేటింగ్ బాగా పెరుగుతున్న కారణంగా చాలా మంది వర్ధమాన కమెడియన్స్ జబర్దస్త్ లో కనిపించేందుకు ముందుకు వచ్చారు. జబర్దస్త్ లో మంచి పేరు దక్కించుకుంటే సినిమాల్లో అవకాశాలు వస్తాయని ఎక్కువ శాతం మంది సినిమా అవకాశాలను వదిలి పెట్టి కూడా జబర్దస్త్ కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతా అనుకున్నట్లుగానే జబర్దస్త్ లో చేసిన చాలా మంది కమెడియన్స్‌ ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. కొందరైతే హీరోగా కూడా సెటిల్ అయ్యారు.

Advertisement

అలాంటి జబర్దస్త్ కార్యక్రమం ఇప్పుడు సినిమా స్టార్స్ తో నిండి పోయింది. ఒకప్పుడు జబర్దస్త్ నుండి సినిమాల్లోకి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సినిమాల్లో ఆదరణ కరువైందని ప్రేక్షకుల ఆదరించడం లేదని జబర్దస్త్ లో కామెడీ చేసేందుకు వస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో తాగుబోతు రమేష్ ఒక స్టార్ గా వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అతను జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. అది కూడా కో టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. కేవలం తాగుబోతు రమేష్ మాత్రమే కాకుండా ఇటీవల భద్రం కూడా జబర్దస్త్ లో సందడి చేస్తున్నాడు. ఎంతో మంది కమెడియన్స్ సినిమాల్లో చేసి ఇప్పుడు జబర్దస్త్ స్టేజిపై కామెడీ చేసి బుల్లి తెర పేక్షకులను నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు.

film comedians in Jabardasth comedy show

Advertisement

ఒకప్పుడు బుల్లితెర అంటే పెద్దగా గౌరవం ఉండేది, కాదు కానీ ఇప్పుడు జబర్దస్త్ వల్ల కమెడియన్స్‌ కి మంచి గౌరవం గుర్తింపు లభిస్తుంది. బుల్లి తెరపై సత్తా చాటితే ఆటోమేటిగ్గా వెండి తెరపై అవకాశాలు వస్తున్నాయి. అందుకే వెండి తెర మీద సందడి చేయలేక పోయినా.. సక్సెస్ కాలేక పోయినా వాళ్ళు ఎప్పుడూ జబర్దస్త్ కార్యక్రమంలో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెండి తెరకు వెళ్లారు. ఇప్పుడు వెండి తెర నుండి పలువురు కమెడియన్స్‌ జబర్దస్త్ లో అడుగు పెట్టారు. మొత్తానికి జబర్దస్త్ ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్ళిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి