Vijay Devarakonda : అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరోకి అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. లైగర్ సినిమాతో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ కెరీర్‌లో దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఈ సినిమా కనుక హిట్ అయి ఉంటే క్రేజ్ మరో రెంజ్‌లో ఉండేది. మొదటిరోజే ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేకపోయింది. దేశవ్యాప్తంగా విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ దృష్ట్యా లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.
సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినిమాను చూసిన ప్రేక్షకులు. ఇక అది అలా ఉంటే మరోవైపు కర్ణుడి చావుకు వెయ్యి కారణాల చందంగా.. ఈ సినిమా మరో చెత్త రికార్డ్‌ను మూట గట్టుకుంది. లైగర్ సినిమాకు ఐఎండిబిలో 10 పాయింట్స్‌కు కేవలం 1.7 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమాకి ఇంత దారుణమైన టాక్ రావడం వెనుక విజయ్ ముఖ్య కారణంగా చెబుతున్నారు.
సినిమా రిలీజ్‌కు ముందు అతడు చేసిన కామెంట్లు కూడా ఈ వైఫల్యానికి కారణమేనంటున్నాడో థియేటర్ యజమాని. ముంబైలోని ఓ థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్.. విజయ్‌పై ఫైర్ అయ్యాడు. ‘మా సినిమాను బాయ్‌కాట్ చేసుకోండి అని చెప్పి తెలివిని ప్రదర్శించాననుకుంటున్నావా? కనీసం ఓటీటీలో కూడా సినిమా చూడరు. నువ్వు కొండవి కాదు అనకొండవి. నాశనమయ్యే సమయం దగ్గరపడ్డప్పుడు నోటినుంచి ఇలాంటి మాటలే వస్తాయి, విజయ్, నువ్వు చాలా అహంకారివి. నచ్చితే చూడండి, ఇష్టం లేకపోతే అసలు చూడకండి అన్న మాటలు ఎంత చేటు తెచ్చాయో నీకింకా అర్థం కావడం లేదా? లైగర్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల చాలా నష్టం జరిగిపోయింది’ అని చెప్పుకొచ్చాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.