Home » Entertainment » Film In Naga Chaitanya Samantha Combination
Entertainment

Naga Chaitanya : సమంత, నాగచైతన్య కాంబినేషన్‌లో మూవీ? ఫ్యాన్స్‌కు ఇక పండగే..!

Authored By
mallesh
The Telugu News | Published on: January 15, 2022, 6:00 pm
Advertisement

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అంతకు ముందు జరిగిన పరిణామాలను చూస్తే వీరి కాంబినేషన్ లో మరో మూవీ వచ్చే చాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. వీరిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో వారిద్దరి ఫ్యాన్స్ ఆనందానికి అవుదుల్లేకుండా పోయాయి. కానీ ఉన్నట్టుండి విడిపోవడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. మళ్లీ వీరిద్దరు కలవాలని కోరుకుంటున్నారు. ఏదైన సమస్య వస్తే కలిసి ఆలోచించి సాల్వ్ చేసుకోవాలని కానీ, ఇలా విడిపోవడం బాగోలేదని సలహా ఇస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

ఇదిలా ఉండగా గతంలో చేసిన అగ్రిమెంట్ ప్రకారం వీరిద్దరూ కలిసి ఓ మూవీలో యాక్ట్ చేయాల్సి ఉందనే టాక్ వినిపిస్తోంది. అది నిజమే అయితే సమంత, నాగచైతన్య ఫ్యాన్స్‌కు పెద్ద పండగ అనే చెప్పాలి.నాగచైతన్య, సమంత విడిపోయిన తర్వాత ఎవరి కెరీర్ పై వారు ఫోకస్ పెట్టారు. వీరిద్దరు విడిపోయవడం వల్ల వారు ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ.. ఓ లేడీ డైరెక్టర్ మాత్రం చాలా ఫీల్ అవుతోందట. సమంత, నాగచైతన్య విడిపోకముందు లేడీ డైరెక్టర్ నందినీరెడ్డితో కలిసి మూవీ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారట.

film in Naga chaitanya samantha combination

Advertisement

Naga Chaitanya : అగ్రిమెంట్ నిజమేనా?

కానీ ఇప్పుడు చూస్తేనేమో వారిద్దరు విడిపోవడంతో పరిస్థితులు అనుకూలించడం లేదు. మరి ఈ అగ్రిమెంట్ నిజమే అయితే నందినీ రెడ్డి డైరెక్షన్‌లో కలిసి యాక్ట్ చేసేందుకు వారిద్దరు ఒప్పుకుంటారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ విషయంపై వారితో కలిసి మాట్లాడాలని అనుకుంటోందట నందినీ రెడ్డి. ఇదిలా ఉండగా సమంతతో కలిసి నందినీరెడ్డి ఇప్పటికే ఓబేబీ మూవీ చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ అగ్రిమెంట్ వార్త తెలిసిన ఫ్యాన్.. నాగచైతన్య, సమంత మళ్లీ కలిసి యాక్ట్ చేయాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ల ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో చూడంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి